»   »  దాసరి మృతి: రజనీ, కమల్, రాజమౌళి, మహేష్, ఎన్టీఆర్ ట్వీట్స్

దాసరి మృతి: రజనీ, కమల్, రాజమౌళి, మహేష్, ఎన్టీఆర్ ట్వీట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో మునిగిపోయింది. దాసరి ఇక లేరు అనే విషాద వార్త తెలియగానే పలువురు స్టార్స్ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేసారు.

మహేష్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్, రామ్ పోతినేని, నాని, అఖిల్ అక్కినేని, రాజమౌళి, అల్లు అర్జున్, కోన వెంకట్, అల్లరి నరేష్, జూ ఎన్టీఆర్ ఇలా ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ అంతా ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేసారు. చిరంజీవి, రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ ఇలా అగ్రతారలంతా దాసరి మరణాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటుగా పేర్కొంటున్నారు.

మహేష్ బాబు ట్వీట్

మహేష్ బాబు ట్వీట్

దాసరి మరణవార్త విని షాకయ్యానని, తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని మహేష్ బాబు ట్వీట్ చేసాడు.

రజనీకాంత్

రజనీకాంత్

దాసరి నారాయణరావు తనకు ఎంతో సన్నిహితుడని, ఇండియన్ సినీ పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని రజనీకాంత్ ట్వీట్ చేసారు.

కమల్ హాసన్

కమల్ హాసన్

దాసరి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని... కమల్ హాసన్ ట్వీట్ చేసారు.

రామ్ పోతినేని

రామ్ పోతినేని

హీరో రామ్ పోతినేని ట్వీట్ చేసాని.... దాసరి నారాయణరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివని అన్నారు.

నాని

నాని

మనమంతా ఒక లెజెండ్ ను కోల్పోయాం, భౌతికంగా ఆయన మన మధ్య లేక పోయినా ఆయన తెరకెక్కించిన క్లాసిక్ సినిమాల రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారు అని నాని ట్వీట్ చేసారు.

అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని

దాసరి లేని లోటు పూడ్చలేనిదని అఖిల్ అక్కినేని ట్వీట్ చేసాడు.

రాజమౌళి

రాజమౌళి

దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ..... గురువుగారు ఇంతకాలం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం సార్ అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.

అల్లు అర్జున్ సంతాపం

అల్లు అర్జున్ సంతాపం

లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు గారు ఇక లేరు అనే విషయం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుబూతి వ్యక్తం చేస్తున్నాను అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసారు.

అల్లరి నరేష్

అల్లరి నరేష్

ఇండస్ట్రీ అందరికీ దారి చూపే వెలుతురును కోల్పోయింది... అంటూ అల్లరి నరేష్ ట్వీట్ చేసారు.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

తెలుగు చిత్ర కళామతల్లి కన్న ఒక దిగ్గజం ఒక లేదు. మరువదు ఈ పరిశ్రమ ఈ సేవలను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.

అల్లు శిరీష్

అల్లు శిరీష్

దాసరి నారాయణరావు గారు డేరింగ్ అండ్ బోల్డ్ వాయిస్ ఆఫ్ తెలుగు సొసైటీ అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేసారు.

ట్వీట్లు

ట్వీట్లు

దాసరి మరణంపై మురుగదాస్, శోభు యార్లగడ్డ, సుమంత్ ట్వీట్లు....

ప్రభాస్ ట్వీట్

ప్రభాస్ ట్వీట్

దాసరి మరణం చాలా విషాదం, తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఆయన చాలా సేవ చేసారంటూ ప్రభాస్ ట్వీట్ చేసారు.

English summary
Check out Celebrities Tweets on Dasari Narayana Rao's Demise. Dasari Narayana Rao First Day Experience In Film Industry is Very insulting. Dasari Narayana Rao (4 May 1942 – 30 May 2017) was an Indian film director, dialogue writer, actor, and lyricist known for his works predominantly in Telugu cinema, and few Bollywood films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu