»   » ఖైదీ నంబర్‌ 150 ఫీవర్... ప్రముఖుల ట్వీట్లూ, అభిమానుల స్పందనలూ

ఖైదీ నంబర్‌ 150 ఫీవర్... ప్రముఖుల ట్వీట్లూ, అభిమానుల స్పందనలూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్‌ చిరంజీవి తొమ్మిది సంవత్సరాల తర్వాత నటించిన 'ఖైదీ నంబర్‌ 150' చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా రోజుల తర్వాత వెండితెరపై చిరుని చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. తెల్లవారు ఝామున 4 గంటలకు బెనిఫిట్‌ షోలు షురూ అయ్యాయి అయినా సరే జాగారం చేసి మరీ చిరు కోసం వేచి చ్వ్హూసారు.. ఇకనేం, అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. 'సినిమా సూపర్‌ హిట్‌' అనే డైలాగ్‌ అభిమానుల నుంచి రావడం కొత్తేమీ కాదు. ఆ విషయం పక్కన పెడితే, 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌..' అంటూ నినాదాలతో ఊగిపోయారు.

తమ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిరంజీవి కన్పించారంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. ఇక, అభిమానుల హంగామాతో తలెత్తిన ట్రాఫిక్‌ సమస్యలతో పోలీసులు నానా తంటాలూ పడాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. అన్నట్టు, బెనిఫిట్‌ షోల పేరుతో అభిమానుల జేబులకు చిల్లులు బాగానే పడ్డాయి. రికార్డు స్థాయిలో బెనిఫిట్‌ షో టిక్కెట్ల ధరలు పలికేశాయి. అల్లు అర్జున్‌, హరీశ్‌ శంకర్‌, అల్లు శిరీష్‌ తదితరులు ట్విట్టర్‌ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మోహన్‌బాబు, అక్కినేని నాగార్జున, రామ్‌, మంచు మనోజ్‌ తదితరులు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.

 టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరో:

టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరో:


మెగాస్టార్ చిరంజీవి...ఈ పేరు తెలియ‌ని తెలుగు సినీ ప్రేక్ష‌కుడు ఉండ‌డు. డ్యాన్సులు, యాక్ష‌న్స్‌లో కొత్త ఒర‌వ‌డిని తీసుకొచ్చిన చిరంజీవి టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరోగా త‌న స‌త్తాను చాటి, బాక్సాఫీస్ రికార్డుల‌ను క్రియేట్ చేశాడు. రాజ‌కీయాల‌కు వెళ్లిన త‌ర్వాత సినీ రంగానికి పూర్తిగా దూర‌మైన చిరంజీవి, మ‌గ‌ధీర‌, బ్రూస్‌లీ సినిమాల్లో మెరిశాడంతే.

 ఎలాంటి క‌థ‌తో రీ ఎంట్రీ:

ఎలాంటి క‌థ‌తో రీ ఎంట్రీ:


రాజ‌కీయాల నుంచి త‌న‌కు స్టార్ డ‌మ్ తెచ్చి పెట్టిన సినిమా రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి అడుగులు వేస్తున్నాడ‌ని తెలియ‌గానే అందరూ అస‌లు చిరంజీవి ఎలాంటి క‌థ‌తో రీ ఎంట్రీ ఇస్తాడోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూడ‌సాగారు. త‌మిళంలో మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌త్తి సినిమాను తెలుగులో వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడ‌ని తెలియ‌గానే అంద‌రిలో ఆస‌క్తి మ‌రింత పెరిగింది.

 ట్విట్టర్ గోడల మీద:

ట్విట్టర్ గోడల మీద:


అస‌లు ఆరు ప‌దుల వ‌య‌సులో చిరంజీవి మునుప‌టిలా త‌న డ్యాన్సులు, యాక్ష‌న్‌తో మెప్పిస్తాడా అని అంద‌రిలో సినిమాపై భారీ అంచ‌నాలే పెరిగాయి. సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా చిరు సినిమా పై తమ తమ ట్విట్టర్ గోడల మీద ఇలా స్పందించారు...

 రాఘవేంద్ర రావు:

రాఘవేంద్ర రావు:


'సినిమా చేసి చాలా రోజులు అయింది' అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు... జై చిరంజీవా. జగదేకవీరా. అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేసిన ట్వీట్ స్పెషల్ అని చెప్పాలి. చిరు సత్తాకి ఎన్ని ఏళ్ళ గ్యాప్ వచ్చినా ఎదురు లేదన్నది అందరికీ తెలిసిదే కదా..

 హరీశ్‌ శంకర్‌:

హరీశ్‌ శంకర్‌:


అల్లు అర్జున్‌ ‘అమ్మడు! లెట్స్‌ డు రికార్డ్స్‌ కుమ్ముడు!' అని ట్వీట్‌ చేశారు.
హరీశ్‌ శంకర్‌ ‘బాక్సాఫీసులు బద్దలు.. అన్ని ఏరియాలనూ రఫ్‌ అడిస్తున్న మెగాస్టార్‌..' అని ట్వీట్‌ చేశారు.
అల్లు శిరీష్‌ ‘మెగా సర్జికల్‌ స్ట్రైక్‌' అని ట్వీట్‌ చేశారు. ఇలా ఒక్కొక్కళ్ళూ చేస్తున్న ట్వీట్లతో నెమ్మదిగా ట్విట్తర్ నిండిపోతోంది.

 ఫీవర్‌ను పెంచేసింది:

ఫీవర్‌ను పెంచేసింది:


దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి సినిమాలో చిరు నటించడం కూడా మూవీ ఫీవర్‌ను పెంచేసింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిరు తనయుడు రాంచరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా, దేవీశ్రీ సంగీతాన్ని సమకూర్చాడు.

English summary
Megastar Chiranjeevi's Khaidi No 150 has received good reviews from Allu Arjun, Rqaghavendra rao and other Telugu celebrities, who say that the boss is back.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu