»   » గాలి కుమార్తె పెళ్లికి వెళ్లిన టాలీవుడ్ స్టార్స్ వీరే, అక్కడ రకుల్ డాన్స్ ..వీడియో ఇదిగో

గాలి కుమార్తె పెళ్లికి వెళ్లిన టాలీవుడ్ స్టార్స్ వీరే, అక్కడ రకుల్ డాన్స్ ..వీడియో ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: గాలి జనార్దన రెడ్డి కూతురు బ్రహ్మణి పెళ్లి బుధవారం ఆర్భాటంగా జరగిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అత్యంత ఘనంగా ఈ వివాహం ఎలా చేస్తారా అని అందరిలోనూ ఓ రకమైన ఆసక్తి, సస్పెన్స్ ఏర్పడింది. అయితే దీనితో నిమిత్తం లేకుండా సన్నాహాలు, ఏర్పాట్లు మాత్రం కనీవినీ రీతిలో జరిగిందని తెలుస్తోంది. ఇంతకీ తెలుగు పరిశ్రమ నుంచి ఈ వివాహానికి ఎవరు వెళ్లారు తెలియచేస్తూ... అలాగే అక్కడ రకుల్ డాన్స్ చేసిన డాన్స్ వీడియో మీకు ఈ క్రింద అందిస్తున్నాం.

పసిడి వెలుగులు, గానా బజానాలు, టాలీవుడ్, బాలీవుడ్ సింగర్ల హంగామా, రష్యన్ డాన్సర్ల చిందులు వెరసి ఓ రేంజ్ లో జరిగిపోయింది గాలి వారి ఇంట పెళ్లి.

నోట్ల రద్దు ప్రభావం ఏ మాత్రం పడకుండా ఎలా ఈ వెడ్డింగ్ జరుపుతున్నారని అందరూ ప్రశ్నిస్తున్నా.. ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ..దీనికి సమాధానమిస్తోంది. ఏర్పాట్ల బాధ్యతలనన్నీ 6 నెలల క్రితమే మా సంస్థకు అప్పజేప్పేశారని, అందువల్ల ప్రాబ్లం లేదని మేనేజింగ్ ప్రిపరేషన్స్ టీమ్ లోని సభ్యుడొకరు తెలిపారు.

ఈ వివాహానికి ...బహుబాష నటుడు, నిర్మాత విశాల్, కామిడి కింగ్ బ్రంహ్మానందం, సాయికుమార్, ఆయన కుమారుడు ఆది, బహుబాష నటీ రాధిక, మీనా, శ్రీయ, నిరోష, కన్నడ క్రేజీస్టార్ రవిచంద్రన్, ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ తదితరులు గాలి ఇంటి జరిగిన పెళ్లికి హాజరై నవదంపతులను ఆశిర్వధించారు.

డాన్స్ హైలెట్ గా..

ఇక అక్కడ పంక్షన్ లో రకుల్ ప్రీతి డాన్స్ చేసింది. ఆ డాన్స్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. రకుల్ ప్రీతికు డాన్స్ చేయటానికి బాగానే ముట్టచెప్పినట్లు చెప్పుకుంటున్నారు.

పెద్ద సంఖ్యలో బౌన్సర్లు

పెద్ద సంఖ్యలో బౌన్సర్లు

హంపీ లోని పురందర టెంపుల్ గుర్తుకు వచ్చేలా బెంగుళూరు ప్యాలస్ ని రూపొందించారు.. బళ్ళారి లోని గాలి నివాసం, హైదరాబాద్ లోని వరుడు రాజీవ్ రెడ్డి ఇంటి నమూనాల మోడల్స్ కూడా ఇందులో ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో బౌన్సర్లతో బాటు సుమారు 3 వేలమందితో కూడిన సెక్యూరిటీ బృందం నిఘా ఉంటుందట.

పెద్ద సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరక్టర్స్

పెద్ద సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరక్టర్స్

ఇందులోభాగంగా 150 కోట్ల రూపాయలతో సినిమా స్టయిల్‌లో వెడ్డింగ్ సెట్స్‌ని డిజైన్ చేశారు. బాజీరావ్ మస్తానీ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్లు సుజీత్ సువాత్, శ్రీరామ్ అయ్యంగర్ దీనికి వర్క్ చేసాడు. విజయనగర రాజ్యం కట్టడాల నమూనాలో ఈ సెట్టింగులు వున్నాయి.

నిజమా..నమ్మలేనట్లుగా

నిజమా..నమ్మలేనట్లుగా

దాదాపు 5 లక్షల మంది ఈ ఫంక్షన్‌కి హాజరు అయ్యారట. ఈ అంచనాల నేపథ్యంలో వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా వుండేందుకు లక్ష మంది గ్రౌండ్ స్టాఫ్, 2500 మంది సూపర్‌వైజర్లు, 1000 మంది మేనేజర్లని నియమించినట్టు సమాచారం.

అంతే ఖర్చు అంటున్నారు.

అంతే ఖర్చు అంటున్నారు.

అయితే, గాలి కుటుంబం మాత్రం ఖర్చు రూ. 50కోట్లుగా చెబుతోంది. ఇవన్నీ ఒకెత్తయితే, మైనింగ్ మాఫియా ఆరోపణలు ఎదుర్కొని అనేక కేసుల్లో నిందితుడుగా ఉన్న గాలి జనార్థనరెడ్డి పిలిచిన పిలుపుతో పెళ్లికెళ్లిన పెద్దలెవరన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తించే అంశం.

ఈ హీరోలు వెళ్లారు

ఈ హీరోలు వెళ్లారు

ఎంతోమంది టాలీవుడ్ స్టార్స్, తెలుగురాష్ట్రాల్లో పొలిటికల్ లీడర్లకు గాలి పెళ్లి పిలుపు అందింది. వీళ్లలో గాలి పెళ్లిలో కనిపించిన టాలీవుడ్ సెలబ్రెటీలు మాత్రం బ్రహ్మానందం, సుమన్, సాయికుమార్, విశాల్ పెళ్లికి హాజరైనట్టు తెలుస్తోంది. రాజకీయపరంగా బీజేపీ సీనియర్ నేత జగదీష్ షెట్లర్ కూడా పెళ్లికి హాజరై నూతన వధువరుల్ని ఆశీర్వదించారు.

తప్పేమి చెయ్యలేదని ప్రూవ్ అయ్యింది

తప్పేమి చెయ్యలేదని ప్రూవ్ అయ్యింది

మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జానర్దన్ రెడ్డి ఎలాంటి తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటున్నారని ఆయన అభిమానులు, అనుచరులు అంటున్నారు. అందుకు కారణం అన్ని పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహానికి హాజరు కావడమే అని ఆయన అనుచరులు అంటున్నారు.

తట్టుకోలేకే ఆ విమర్శలు

తట్టుకోలేకే ఆ విమర్శలు

నిజంగా గాలి జనార్దన్ రెడ్డి తప్పు చేసి ఉంటే ఈ రోజు ఈ రాజకీయ పార్టీ నాయకులు వచ్చే వారా ? అని ఆయన అభిమానులు అంటున్నారు. ఓ వ్యక్తి పైకి ఎదిగితే తట్టు కోలేని చాలమందే ఉంటారు అనేది సర్వ సాదరంనం అని అన్నారు. అయితే గాలి తన కుమార్తె పెళ్లి చేస్తుంటే ఇబ్బందులు కల్పిస్తున్న వారి మీద గాలి అభిమానులు మండిపడుతున్నారు.

దేశంలో చాలా పెళ్లిళ్లు

దేశంలో చాలా పెళ్లిళ్లు

మైనింగ్ సామ్రాట్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహంపై ప్రభుత్వాన్ని నిలదీశారు జేడీయూ నేత శరద్ యాదవ్. దేశంలో కరెన్సీ కష్టాలు ప్రతీ సామాన్యుడిని వెంటాడుతున్న నేపథ్యంలో.. చాలా పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని, అలాంటిది గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి మాత్రం ధూంధాంగా జరిగిందని అన్నారు.

అంత భారీ స్దాయిలోనా

అంత భారీ స్దాయిలోనా

పెళ్లి కోసం అత్యంత భారీ స్థాయిలో రూ.500కోట్లు ఖర్చు పెడుతుంటే.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు శరద్ యాదవ్. కాగా, బెంగుళూరు ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన గాలి కుమార్తె పెళ్లి గురించి దేశమంతా చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇవన్నీ కనిపించటం లేదా

ఇవన్నీ కనిపించటం లేదా

భారతీయ జనతా పార్టీ నాయకుల వద్ద నల్లధనం ఉందని, అలా ఉందని చెప్పడానికి కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లే నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు బుధవారం నాడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఇవన్నీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

అదిరిపోయేలా

అదిరిపోయేలా

జనార్దన్ రెడ్డి తన స్థాయికి తగ్గట్లు తన కుమార్తె బ్రహ్మిణి వివాహం జరిపించారు. పెళ్లికి విచ్చేసిన అతిథులకు అదిరిపోయే ఆంధ్రా స్టైల్ భోజనాలు వండించారు. పెళ్లికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం ఎదురుకాకుండా చూసుకున్నారు. మైసూరు పాక్, లడ్డు, 16 రకాల స్వీట్స్, పలు రకాల పచ్చళ్లు, గోంగూర చట్ని, పరోట, కుర్మా, అన్నం, పప్పు, సాంబార్, రసం, క్యారెట్ హల్వా, రసగుల్ల, పెరుగు, ఆవకాయ తదితర వంటకాలు అదిరిపోయే రిచితో తయారు చేయించారు.

English summary
Gali Janardhan Reddy recently hosted part of the celebs from the Telugu film industry and requested them to attend his daughter's wedding. It is said that his team has approached a number of top actors and actresses. Stars like Rana Daggubati and Ravi Teja were among the celebs who were approached for the event, but they reportedly denied to make it to the marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu