ఎంఎస్‌కు నివాళి: రామ్ చరణ్, వెంకీ, మనోజ్ (ఫోటోస్)
హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మృతి పట్ల తెలుగు చిత్రసీమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు శుక్రవారం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తెలుగు స్టార్స్ వెంకటేష్, రామ్ చరణ్, మనోజ్, అల్లరి నరేష్, నాగబాబు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీను వైట్ల, సత్యం రాజేష్, వేణు మాధవ్, ఆర్ నారాయణమూర్తి, బాబూ మోహన్, షఫి, అలీ, చలపతిరావు, ఎస్వీ కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి, సరేష్ బాబు, నరేష్ తదితరులు నివాళు అర్పించారు.
సంక్రాంతి సెలబ్రేషన్స్ సందర్భంగా భీమవరం వెళ్లిన ఆయన మలేరియా బారిన పడ్డారు. ఈ నెల 19 నుండి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వయసు పైబడటంతో....షుగర్ లెవల్స్ పెరిగి పోవడం, గుండె సంబంధిత సమస్యలు ఒకసారి ఎదురు కావడంతో ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు ఫెయిల్యూర్ అయ్యాయని వైద్యులు తెలిపారు. గురువారం ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించినా పరిస్థితి మెరుగు పడలేదు. శుక్రవారం ఉదయం 9.40 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.
శుక్రవారం మధ్నాహ్నం 2 గంటల నుండి సాయంత్రం4 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్లో ఎంఎస్ పార్థివదేహాన్ని ఉంచారు. వికారాబాద్ లోని ఎంఎస్ ఫామ్ మౌస్ లో శనివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
స్లైడ్ షోలో ఫోటోలు....

వెంకటేష్
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న ప్రముఖ నటుడు వెంకటేష్

రామ్ చరణ్
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న రామ్ చరణ్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న బాలసుబ్రహ్మణ్యం.

మనోజ్
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న మంచు మనోజ్

నాగబాబు
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న నాగబాబు.

శ్రీను వైట్ల
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న దర్శకుడు శ్రీనువ వైట్ల.

సత్యం రాజేస్
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తూ సత్యం రాజేష్ కన్నీటి పర్యంతం అయ్యారు.

వేణు మాధవ్
ఎంఎస్ నారాయణ తనయుడు విక్రమ్ ను ఓదారుస్తున్న వేణు మాధవ్.

ఆర్ నారాయణ మూర్తి
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న విప్లవ సినిమాల నటుడు ఆర్ నారాయణ మూర్తి.

బాబూ మోహన్
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న బాబూ మోహన్.

షఫి
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న షఫి.

ఓదార్పు
పలువురు ప్రముఖులు ఎంఎస్ నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

రమ్య శ్రీ
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న నటి రమ్యశ్రీ.

అలీ, మనో
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న సింగర్ మనో, నటుడు అలీ.

అల్లరి నరేష్, రాజేష్
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న అల్లరి నరేష్, రాజేష్.

చలపతిరావు
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న నటుడు చలపతిరావు.

ఎస్వీ కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి.

నటుడు సురేష్
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న నటుడు సురేష్.

సురేష్ బాబు
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న నిర్మాత సురేష్ బాబు.

నరేష్
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న నటుడు నరేష్.

ప్రముఖులు
ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తున్న సినీ ప్రముఖులు.

కన్నీటి పర్యంతం
ఎంఎస్ నారాయణ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

అభిమానుల తాకిడి
ఎంఎస్ నారాయణ చివరి చూపు కోసం పలువురు అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు.


Click it and Unblock the Notifications











