Don't Miss!
- News
చంద్రబాబుకు పొంచివున్న ప్రమాదం: ఎలాగో వివరించిన మంత్రి రోజా..!!
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్‌సౌ!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Chalapathi Rao death చలపతిరావు బాబాయ్ ఇకలేరు.. అంత్యక్రియలు ఆలస్యం.. కారణం ఏమిటంటే?
విలక్షణ నటుడు, నిర్మాత తెలుగు సినిమా పరిశ్రమకు సుదీర్ఘకాలంగా తన నటనతో సేవలు అందించిన చలపతిరావు ఇక లేరు. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణవార్త వినగానే తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖలు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. చలపతిరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. అయితే చలపతిరావు వ్యక్తిగత జీవితం, అంత్యక్రియల జరిపే వివరాల్లోకి వెళితే..

చలపతిరావు వ్యక్తిగత జీవితం
నటుడు చలపతిరావు అసలు పేరు తమ్మారెడ్డి చలపతిరావు. 1944, మే 8వ తేదీన బ్రిటీష్ ఇండియా పాలనలోని మద్రాసు ప్రసిడెన్సీలోని బలపర్రులో జన్మించారు. ఆయన ఇందుమతిని వివాహం చేసుకొన్నారు. రవిబాబుతోపాటు ఆయనకు ముగ్గురు పిల్లలు. భార్య వియోగంతో మరణించేంత వరకు ఒంటరిగానే జీవించారు. డిసెంబర్ 24వ తేదీ రాత్రి తుదిశ్వాస విడిచారు.

చలపతిరావు సినీ రంగ ప్రవేశం
1966 సంవత్సరంలో గూడఛారి 116 సినిమాతో చలపతిరావు సినీ రంగంలోకి ప్రవేశించారు. ఇప్పటి వరకు ఆయన 1200 చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం బంగార్రాజు. నిర్మాతగా కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రసిడెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి సినిమాలను నిర్మించారు.

మూడు తరాలతో 6 దశాబ్దాల సినీ జీవితం
చలపతిరావు సినీ జీవితం దాదాపు 6 దశాబ్దాలకాలం కొనసాగింది. తనదైన శైలిలో నటించి విలనిజానికి గొప్ప గుర్తింపు తెచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, శోభన్ బాబుతో పలు చిత్రాల్లో నటించారు. బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, చిరంజీవి, రవితేజతోపాటు నటించారు. ఆ తర్వాత నందమూరి, అక్కినేని, ఘట్టమనేని మూడోతరం వారితో కూడా కలిసి నటించిన ఘనతను చలపతిరావు సొంతం చేసుకొన్నారు. సినీ పరిశ్రమలో మూడు తరాల నటులతో కలిసి నటించిన ఘనత సాధించిన వారిలో చలపతి రావు ఒకరు అని చెప్పుకోవచ్చు.

ముద్దుగా బాబాయ్ అంటూ సినీ వర్గాలు..
చలపతిరావు చూడటానికి కరకుగా ఉంటారు కానీ.. వ్యక్తిగతంగా చాలా సున్నితమైన మనస్కుడు. మద్యం, మంసాహారానికి దూరంగా ఉంటారు. ఆయన చేసిన విలన్ పాత్రల ప్రభావంతో ఆయన బయట కూడా అలానే ఉంటారని భ్రమపడుతుంటారు. ఇండస్ట్రీలో చలపతిరావును బాబాయ్ అని ముద్దుగా పిలుచుకొంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారిలో చలపతిరావు ఒకరు అని సినీ వర్గాలు చెప్పుకొంటారు.

అమెరికాలో ఇద్దరు కూతుళ్లు
చలపతిరావు మరణంపై కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు స్పందించారు. రాత్రి ఎనిమిది గంటలకు నాన్న గారు చనిపోయారు. మధ్యాహ్నం మహా ప్రస్థానం కు తీసుకొని వెళ్తాం. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తాం. మా అక్కలు అమెరికాలో ఉంటున్నారు. వారు అక్కడి నుంచి రావాల్సి ఉంది. అందుకే బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తాం అని రవిబాబు తెలిపారు.

బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు
అమెరికాలో ఉంటున్న తన అక్కయ్యలు రావడం ఆలస్యం కానుండటంతో చలపతిరావు పార్థీవ దేహాన్ని ఆదివారం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి తరలిస్తారు. అప్పటి వరకు తమ నివాసంలో చలపతిరావు భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. బుధవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.