For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  "పుల్లెల గోపీ చంద్" బయో పిక్..వాళ్ళిద్దరి వివాదం కూడానా..?

  |

  ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితచరిత్ర, ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు కొంతకాలం క్రితమే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో . గోపీచంద్ పాత్రను సుధీర్ బాబు పోషించనున్నాడు. ఇక ఈ సినిమాను నవంబర్ లో సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నట్టు తాజాగా ఆయన తెలిపాడు.రియో ఒలింపిక్స్ లో పివి సింధు వెండి పతకం గెలవడంతో ఆమె గురువైన గోపీచంద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఎంతోమంది క్రీడాకారుల కెరీర్ ను తీర్చిదిద్దిన కోచ్ గోపీచంద్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇప్పుడు తెరపై ఆవిష్కరించనున్నారు.

  నిజానికి గోపీచంద్ బయోపిక్ లో హీరోగా చేయాలనేది సుధీర్ బాబు కల. సుధీర్ స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయరే కాక, గోపీచంద్ తో అతనికి చాలా మంచి స్నేహబంధం ఉంది. గోపీచంద్ కూడా తన బయోపిక్ ఒకవేళ తెరకెక్కితే, సుధీర్ కరెక్ట్ గా న్యాయం చేయగలడు అని స్వయంగా చెప్పాడు. ఇక ఇప్పుడు సినిమా మొదలు పెట్టటాని సరైన సమయం ఈ హైప్ చల్లారక ముందే సినిమా వచ్చేయాలన్న తపనతో పనులు మొదలు పెట్టేసారట.. ఒక్క రామ్ గోపాల్ వర్మ మినహా తెలుగులో బయో పిక్ లపై మగ్గుచూపిన వారి సంఖ్య తక్కువే. రాఘవేంద్రరావు అన్నమయ్య, గుణశేఖర్ రుద్రమదేవి సినిమాలు చారిత్రాత్మక నేపధ్యాలున్న కధనాలు. వాటిని పూర్థిస్థాయి బయోపిక్ అనలేం.... ఇక ఇప్పుడు తెలుగులో వస్తూన్న ఈ లేటెస్ట్ బయో పిక్ వివరాలు...

  ప్రసంసల వెల్లువ

  ప్రసంసల వెల్లువ

  భారత దేశానికి తన పతకం ద్వారా వన్నె తెచ్చిన సింధూ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. ఎక్కడ చూసినా అభిమాన వెల్లువ , నజరనాలూ ఇవన్నీ మామూలే .. ఆమెతో పాటు ఆమె కోచ్ గోపీ చంద్ మీద కూడా ప్రసంసల వెల్లువ కురుస్తోంది.

  క్రీడాభిమానులకి సుపరిచితం

  క్రీడాభిమానులకి సుపరిచితం

  పుల్లెల గోపీచంద్ గా ఎప్పటి నుంచో భారత దేశ క్రీడాభిమానులకి సుపరిచితం అయిన గోపి దేశ పతాకాన్ని 2016 లో ఒక కోచ్ గా రెపరెప లాడిస్తాడు అని ఎవ్వరూ బహుశా ఊహించి ఉండరు. గోపీ చంద్ బాడ్మింటన్ అకాడమీ పెట్టి అందులో తానే సొంతగా ట్రైనింగ్ ఇస్తూ సింధూ లాంటి వాళ్ళని తయారు చెయ్యడం మొదలు పెట్టాడు.

  సంవత్సరాల కృషి

  సంవత్సరాల కృషి

  చివరకి ఎన్నో సంవత్సరాల కృషి ఈ రోజు ప్రపంచం మొత్తం అతని పేరు, అతని శిష్యురాలి పేరు మారు మ్రోగే విధంగా చేసింది.

  ఒక బాలీవుడ్ సినిమా

  ఒక బాలీవుడ్ సినిమా

  సుధీర్ బాబు బాలీవుడ్ రంగప్రవేశం బాగానే కలిసొచ్చినట్టుంది. లేటెస్ట్ గా సుధీర్ హీరోగా ఒక బాలీవుడ్ సినిమా తెరకెక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్యామస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో హీరోగా సుధీర్ బాబు చేస్తున్నాడని సమాచారం.

  బయోపిక్

  బయోపిక్

  బాలీవుడ్ లో యమ హిట్ ట్రెండ్ గా నిలుస్తున్న ఈ బయోపిక్ లు తెలుగులో ఎందుకు ప్రాచుర్యం చెందడంలేదో అర్ధంకాని విషయం. ముఖ్యంగా క్రీడాకారుల నేపధ్యంలో హిందీలో తెరకెక్కే సినిమాలకు ఎక్కడలేని డిమాండ్ వుంటుంది.

  హీరో సుదీర్ బాబు

  హీరో సుదీర్ బాబు

  భలే మంచి రోజు విడుదల అయిన తరవాత తెలుగు హీరో సుదీర్ బాబు ఇప్పటి వరకూ తన తరవాతి ప్రాజెక్ట్ ని మొదలు కూడా పెట్టలేదు. పుల్లెల గోపీ చంద్ జీవిత విశేషం ఆధారంగా ఆయన జీవిత గాథ ని తెరకి ఎక్కించే సినిమాకి ఎప్పుడో సంతకం పెట్టిన సుధీర్ ఇప్పటి వరకూ షూటింగ్ మొదలు పెట్టలేదు.

  స్క్రిప్ట్ వర్క్

  స్క్రిప్ట్ వర్క్

  ఈ సినిమాని హిందీ లో తీయడానికి ఫిక్స్ అయిన సుధీర్ అక్కడ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తూ ఉండడం తో తాను గ్యాప్ తీసుకుంటున్నాడు.

  సీన్ మారిపోయింది

  సీన్ మారిపోయింది

  మొన్న మొన్నటి వరకూ ఈ సినిమా ఎప్పుడు షురూ అవుతుందో ఎవ్వరికీ తెలీదు కానీ ఇప్పుడు ఒలంపిక్స్ లో సింధూ మెడల్ గెలవడం తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.ఇప్పుడు ఈ సినిమా ఎంత త్వరగా అయితే అంత విజయావకాశాలు..

  బూస్ట్ వచ్చినట్టయ్యింది

  బూస్ట్ వచ్చినట్టయ్యింది

  సింధు విజయం వెనకాల గోపీ చంద్ ఉండడంతో ఈ సినిమా రైటర్ లకి ఫుల్ బూస్ట్ వచ్చినట్టయ్యింది. క్లైమాక్స్ కి , ప్రీ క్లిమాక్స్ కీ కావాల్సినంత స్టోరీ వారికిప్ప్పుడు దొరికేసింది.

  స్ట్రగుల్ అయిన అనుభవాలు

  స్ట్రగుల్ అయిన అనుభవాలు

  గోపీ కథ లో మొదటి నుంచీ చాలా స్ట్రగుల్ అయిన అనుభవాలు ఉన్నాయి. అవన్నీ కలిపి కథ తయారు చేస్తున్న కథకులకి ఇప్పుడు ఒక అద్బుతమైన లైన్ వచ్చేసింది.

  గురువు గా కథ

  గురువు గా కథ

  తన స్టూడెంట్ కోసం జీవితాన్ని మొత్తం కష్ట పడిన గురువు గా కథ లో మార్పులు చేస్తూ సింధూ మెడల్ అచ్చీవ్మేంట్ ని క్లిమాక్స్ గా ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది.

  ఖచ్చితంగా హాట్ టాపిక్కే

  ఖచ్చితంగా హాట్ టాపిక్కే

  భారత క్రీడా చరిత్ర లో అత్యంత ప్రభావిత కోచ్ ల జాబితా లో నిలిచిన గోపీ చంద్ మీద సినిమా అంటే అదిప్పుడు ఖచ్చితంగా హాట్ టాపిక్కే. దేశం అంతా అతని సూపర్ కృషి ని పొగుడుతూ ఉన్న వేళ గోపీ మీద సినిమా ప్రకటిస్తే చాలు డిస్ట్రిబ్యూటర్ లు వాలిపోతారు.

  పోరాటం, ప్రేమవివాహం, కెరీర్‌

  పోరాటం, ప్రేమవివాహం, కెరీర్‌

  గోపీచంద్‌ జీవిత కథ సినిమా కథలకు ఏమాత్రం తీసిపోదన్నది పలువురి అభిప్రాయం. కెరీర్‌ తొలి రోజుల్లో పోరాటం, ప్రేమవివాహం, కెరీర్‌ ముగిసిందని అనిపించిన సమయంలో... కోలుకుని భారత బ్యాడ్మింటన్‌ చరిత్రను తిరగరాసి విజయాన్ని కైవసం చేసుకోవడం... ఇదంతా వెండితెరమీద ప్రేక్షకులకు చెప్పదగ్గ కథేనని నిర్మాత అభిషేక్‌ నామా అభిప్రాయపడ్డారు.

  ఇంట్రెస్ట్ చూపించలేదు

  ఇంట్రెస్ట్ చూపించలేదు

  నిజానికి మొన్నటి వరకూ "గోపీ చంద్" కథ అంటే సరైన ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే కొన్నినెలల క్రితమే మొదలు కావాల్సిన సినిమా అప్పుడూ..ఇప్పుడూ అంటూ వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండీ గోపీ ఒక ఇంటర్నేషనల్ హీరో అయిపోయాడు.

  గోపీచంద్ నిజమైన హీరో

  గోపీచంద్ నిజమైన హీరో

  సుధీర్ బాబు మాట్లాడుతూ.. 'గోపీచంద్ నిజమైన హీరో. అతని కథ ప్రపంచానికి తప్పకుండా తెలియాలి. అతన్ని నేను దగ్గర నుంచి చూశాను. గోపీతో కలిసి డబుల్స్ కూడా ఆడాను. ఆయన పాత్రకు సరిపోతానని భావిస్తున్నాను' అని చెప్పారు.

  గోపీచంద్ అయిష్టం

  గోపీచంద్ అయిష్టం

  గోపీచంద్ కు ఈ విషయం తెలిపినప్పుడు ఆయన అయిష్టంగా ఉన్నారని, అయితే తప్పకుండా అందరికీ తెలియజేయాల్సిన ప్రయాణం అని అందరూ చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నారని సుధీర్ బాబు చెప్పాడు.

  18 నెలల క్రితమే

  18 నెలల క్రితమే

  దాదాపు18 నెలల క్రితమే కథపై కసరత్తు మొదలుపెట్టగా.. ఈ నవంబరులో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

  షూటింగ్

  షూటింగ్

  షూటింగ్ మొత్తం హైదరాబాద్, లక్నో, బెంగుళూరు, బర్మింగ్ హామ్ లలో జరగనుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'బయో పిక్' ట్రెండ్ నడుస్తుంది. ప్రముఖుల జీవితాలను, లక్ష్య సాధనలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

  ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

  ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

  అయితే ఈ సినిమాలో సైన నెహ్వాల్, జ్వాలా గుత్తా, సింధూల పాత్రల మీద ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

  ఆసక్తికర అంశం

  ఆసక్తికర అంశం

  సైనా, గోపీచంద్ తో విభేదాల కారణం గా విడిపోవటం తో ఇప్పుడు ఆమె పాత్రని నెగెటివ్ గా చూపిస్తారా లేక మామూలుగానే ఉంటుందా అన్నది కాస్త ఆసక్తికర అంశం..

  జ్వాలా గుత్తా కూడా

  జ్వాలా గుత్తా కూడా

  ఇక జ్వాలా గుత్తా కూడా గోపీ దగ్గరినుంచి వెళ్ళిపోయి తీవ్ర విమర్షలు చేసింది. ఇక వీరిద్దరి పత్రలని మలిచే తీరు ఎలా ఉండబోతుందన్నది. ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఒక వేళ నెగెటివ్ గా చూపిస్తే వారి ప్రతిస్పందన ఎలా ఉండబోతుందన్నది మరింత ఆసక్తి కరంగా మారనుంది.

  సింధూ ఒప్పుకుంటుందా

  సింధూ ఒప్పుకుంటుందా

  ఇక సింధూ పాత్రలో ఆమెతోనే నటింపజేస్తే ఎలా ఉంటుందీ అనే ఆలోచనలో ఉన్నారట. మరి సింధూ ఒప్పుకుంటుందా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడున్న హడావిడి ముగిసాకే.. సింధుని,గోపీ చంద్ నీ సంప్రదించాలనుకుంటున్నారట. సింధూ నటించాలనుకున్నా గోపీ కూడా ఒప్పుకోవాలి కదా మరి.

  గోపీచంద్ అనుభవం

  గోపీచంద్ అనుభవం

  గోపీచంద్ తో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన అనుభవం.. ఆయనతో వున్న సాన్నిహిత్యం...ఇవి గోపీ చంద్ గా నటించటానికి సుధీర్ బాబుకి కలిసి వచ్చే అంశాలు. ఇక చిత్రం కోసం ఎదురు చూడాల్సిందే..

  యమున ఇంటర్వ్యూ పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...

  యమున ఇంటర్వ్యూ పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...

  యమున ఆర్టికల్ కోసం క్లిక్ చేయండి

  English summary
  Sudheer Babu, brother-in-law of Telugu actor Mahesh Babu, will play as Gopichand in a bio pic on Pullela Gopichand, the man behind India's badminton success in Olympics..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X