»   » చంద్రముఖి 2 విడుదల ఎప్పుడంటే..?

చంద్రముఖి 2 విడుదల ఎప్పుడంటే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్ హీరోగా చింతకాయల రవి తర్వాత నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో త్వరితగతిన జరుగుతోంది. దానికి కారణం ఈ సినిమాని నవంబర్ రెండవ వారంలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బెంగళూరులో నవంబర్ 5 వరకు కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అటు తర్వాత హైదరాబాద్ ‌లో మరో షెడ్యూలు ఉంటుంది. పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా అనుష్క చేస్తోంది. చింతకాయల రవి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై వెంకటేష్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇకా పీరియాడిక్ ధ్రిల్లర్ సినిమాలో వెంకటేష్ ఒక కొత్త గెటప్ లో కనిపిస్తారని వినికిడి. ఆ కొత్త గెటప్ ఏంటంటే ఒక వృధ్దుని వేషంలో కనిపించి అభిమానులకు పండగ చేయనున్నారు. ఈ సినిమాకి మూలం కన్నడ ఆప్త రక్షక. కన్నడ ఆప్త రక్షక లో హీరోగా డాక్టర్ విష్ణు వర్దన్ ఆ పాత్రను పోషించాడు. ఈ సినిమా తర్వాత గుండెపోటుతో ఆయన మరణించారు. ఆప్త రక్షక కన్నడ చిత్రాన్ని కూడా పి.వాసు డైరక్ట్ చేసారు. అక్కడ ఈ సినిమా చాలా పెద్ద ఘన విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్కతో పాటు కమలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్‌, పూనమ్ ‌కౌర్‌, రిచా గంగోపాధ్యాయ వెంకటేష్ సరసన హీరోయిన్లు గా నటించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu