»   » దిల్ రాజుకి నోటీసులు... టైటిల్ మార్చమంటూ పోలీస్ లు డిమాండ్

దిల్ రాజుకి నోటీసులు... టైటిల్ మార్చమంటూ పోలీస్ లు డిమాండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డబ్ చేస్తూ విడుదల చేస్తున్న విజయ్ తాజా చిత్రం పోలీసోడు టైటిల్‌పై పోలీసు అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చిత్రానికి పెట్టిన పేరు పోలీసుల్ని అగౌరవపరిచేదిగా, వారి మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర విభాగం అధ్యక్షుడు ఎన్.శంకర్‌రెడ్డి ఆరోపించారు.

ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది. ఈలోపు చిత్రం పేరు మార్చాల్సిందేనని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి దిల్‌రాజు ఇంటి వద్ద నోటీసులు ఇవ్వడానికి పోలీసు అధికారుల సంఘం సన్నాహాలు చేస్తోంది.

Change title of Vijay's Polisodu:Police

విజయ్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం తేరి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్. థానుతో కలిసి దిల్‌రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పోలీసోడు టైటిల్ తో అందిస్తున్నారు. సమంతా, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ... పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. తుపాకి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ ఈ సినిమాలోనూ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ఓ పోలీస్ ఆఫీసర్‌కు ఎదురైన కొన్ని అనూహ్య పరిణామాలేమిటి? ఓ పాప పరిచయంతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది తెరపై ఉత్కంఠను కలిగిస్తుంది. విజయ్ పాత్ర చిత్రణ మూడు భిన్న పార్శాల్లో స్టెలిష్‌గా సాగుతుంది.

Change title of Vijay's Polisodu:Police

మనోభావాలను గౌరవించి విజయ్ 'పోలీసోడు' టైటిల్ మార్పు

ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రానికి తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ ను అనుకున్న విషయం తెలిసిందే. తేరి చిత్రానికి పోలీసోడు అనే టైటిల్ ను పెడితే బాగుంటుంది అని నిర్ణయించింది నిర్మాత కలయిపులి ఎస్ థాను. దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని తెలుగు లో కేవలం విడుదల మాత్రమే చేస్తున్నారు.

అయితే, కొన్ని పోలీస్ సంఘాలు దిల్ రాజు గారిని కలిసి, ఈ టైటిల్ పై అభ్యంతరం తెలపటం తో, అయన ఈ విషయాన్నీ నిర్మాత కలయిపులి ఎస్ థాను కు వివరించారు. ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు అనే ఉద్దేశం తో ఈ టైటిల్ ను పోలీస్ గా మరుస్తున్నట్టు ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేస్తున్న దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రం ఏప్రిల్ 15 న తెలుగు రాష్ట్రాలలో "పోలీస్" పేరు తో గ్రాండ్ గా విడుదల అవుతుంది. .

ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ బోర్డు U సర్టిఫికేట్ ను ఇచ్చింది. భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు.

విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు

దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను.

English summary
Police association said they plan to lodge an notice against Dilraju . “We will not allow anybody to defame Police Department. He should give some other title to this film,” they said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu