»   » టాలీవుడ్ దుస్థితి: కథ కాదు, కర్చీఫ్ వేసే దమ్మున్నోడే..

టాలీవుడ్ దుస్థితి: కథ కాదు, కర్చీఫ్ వేసే దమ్మున్నోడే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో రాణించాలంటే చేతిలో మంచి కథ ఉంటే చాలు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు స్టార్ హీరోల డేట్స్ చేతిలో ఉంటే చాలు అన్నది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. చేతిలో ఎంత మంచి కథ ఉన్నా సినిమా నిర్మించడానికి, పైనాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదిప్పుడు.... కానీ కథ లేక పోయినా స్టార్ హీరోల డేట్స్ ఉంటే చాలు అనేక మంది ఫైనాన్స్ చేయడానికి, నిర్మించడానికి ముందుకు వస్తున్నారు.

'అర'జాన బాహుడు: జూనియర్‌పై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్లో మారిపోయిన ఈ పరిస్థితిపై నిర్మాత చంటి అడ్డాల మాట్లాడుతూ....'ఒక‌ప్పుడు క‌థ గురించి ఆలోచించి, క‌థ‌లు సిద్ధం చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు క‌థ‌ల క‌న్నా, కాంబినేష‌న్ల‌కు విలువ పెరుగుతోంది. చిన్న వాళ్ల‌తో సినిమాలు చేస్తామంటే వ‌డ్డీల‌కు ఇచ్చేవారు కూడా ముందుకు రావ‌డం లేదు. అదే మంచి కాంబినేష‌న్ తో సినిమాలు చేస్తామంటే చాలా మంది ముందుకొస్తున్నారు. ఇప్పుడున్న‌వి క‌థ‌ల‌కు రోజులు కాదు. ఖ‌ర్చీఫ్ కు రోజులు. పూర్తిగా చిన్న వాళ్ల‌తోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగే ఆలోచ‌న లేదు' అన్నారు.

దిల్ రాజు-త్రివిక్రమ్ భారీ మూవీ ప్రకటన, హోల్డ్ లో పవన్ కళ్యాణ్ పేరు?

Chanti Addala about tollywood present trend

జూన్ 9న పుట్టినరోజు జపుకుంటున్న సందర్భంగా చంటి అడ్డాల మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేసారు. తను సినిమాల గురించి చెబుతూ...'ఓ స్టార్ హీరోతో డిసెంబ‌ర్‌లోగానీ, జ‌న‌వ‌రిలోగానీ సినిమాను మొద‌లుపెడ‌తాం. ఎవ‌రితో, ఏంటి అనేది వారే ప్ర‌క‌టిస్తారు. సీనియ‌ర్ న‌రేశ్ కుమారుడు న‌వీన్ విజ‌య‌కృష్ణ‌తో తీస్తున్న సినిమాను వాళ్లే విడుద‌ల చేస్తామ‌న్నారు. అందువ‌ల్ల ఇప్పుడు పెద్ద హీరో ప్రాజెక్ట్ మీద దృష్టి పెడుతున్నాను. భారీ ప్రాజెక్టులు చేస్తూ అప్పుడ‌ప్పుడూ మంచి క‌థ‌ల‌తో చిన్న సినిమాల‌ను చేయాల‌ని ఉంది' అన్నారు.

'తాను ఆర్ట్ డైర‌క్ట‌ర్‌గా కొనసాగుతున్న రోజుల్లోనే చాలా సుఖంగా ఉండేది. కాక‌పోతే సినిమా త‌ప్ప ఇంకేమీ చేయ‌డం తెలియ‌ని వ్య‌క్తిని కాబ‌ట్టి ఇప్పుడు సినిమాల‌ను తీస్తున్నాను. ఒక‌ప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు ఆర్ట్ డైర‌క్ష‌న్ కాస్త సులువుగానే ఉంది. గ్రీన్ మ్యాట్‌, బ్లూ మ్యాట్‌లు వేయ‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాత చాలా వెసులుబాటు క‌నిపిస్తోంది. మోడ‌ళ్లు కావాల‌న్నా.. నెట్లో బోలెడ‌న్ని డిజైన్లు క‌నువిందు చేస్తున్నాయి' అన్నారు చంటి అడ్డాల.

English summary
Tollywood film maker Chanti Addala to celebrate his birthday on June 09.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu