For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఉదయ్ కిరణ్ ఏడ్చేశాడు, అలా చేస్తే ఆత్మహత్య చేసుకునేవాడు కాదేమో: సుధ

  By Bojja Kumar
  |
  Character Artist Sudha Talks About Uday Kiran

  ప్రముఖ తెలుగు నటి సుధ ఇటీవల ఓ టీవీ షోలో సందడి చేశారు. కమెడియన్ ఆలీ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1981లో ఇండస్ట్రీకి వచ్చానని, తాను హీరోయిన్ గా నటించిన తొలి 2 సినిమాలు విడుదల కాలేదు. అవి విడుదల కాకపోవడం వల్లనే ఈ రోజు ఇండస్ట్రీలో మీ ముందు ఉన్నాను. అదే విధంగా తనను అనకూడని మాటలు అన్న ఓ దర్శకుడి గురించి కూడా సుధ వెల్లడించారు. యంగ్ హీరో ఉదయ్ కిరణ్‌ గురించి, అతడితో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుని ఈ సందర్భంగా సుధ ఎమోషనల్ అయ్యారు.

   ‘నీ మొహం గ్లామర్‌కు పనికి రాదు' అన్నారు

  ‘నీ మొహం గ్లామర్‌కు పనికి రాదు' అన్నారు

  1981లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నా అదృష్టం కొద్దీ నేను చేసిన రెండు సినిమాలు విడుదల కాలేదు. 1984లో మళ్లీ గురువు బాలచందర్ నుంచి పిలుపు వచ్చింది. ‘నీ మొహం గ్లామర్‌కు పనికి రాదు' అని ఆయన మొహం మీదే చెప్పేశారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తానంటే కొన్ని రోజులకే అన్నీ సర్దుకుని ఊరెళ్లిపోవాల్సిందే అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అక్క, వదిన, అమ్మ పాత్రలు చేస్తే భవిష్యత్తు బావుంటుందని ఆయన సూచించడంతో అవి చేసుకుంటూ విజయవంతంగా తన కెరీర్ కొనసాగిస్తున్నాను అని సుధ వెల్లడించారు.

  ఉదయ్ కిరణ్‌ను దత్తత తీసుకోవాలనుకున్నారా?

  ఉదయ్ కిరణ్‌ను దత్తత తీసుకోవాలనుకున్నారా?

  హీరో ఉదయ్ కిరణ్‌ను మీరు దత్తత తీసుకోవాలనుకున్నారట కదా? దాని గురించి చెప్పండి.... అని ఆలీ అడగ్గానే సుధ ఎమోషనల్ అయ్యారు. ఆ అబ్బాయి నాతో 9 సినిమాల్లో కొడుకుగా చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే బాలచందర్ గారి గురించి అడిగినా, ఉదయ్ కిరణ్ గురించి అడిగినా ఎమోషనల్ అవ్వకూడదని అనకుని వచ్చాను. కానీ నా వల్ల కావడం లేదు. ఆ అబ్బాయి గురించి అడిగితే కంట్రోల్ అవ్వలేను, అదే విధంగా మా మదర్ గురించి అడిగినా కంట్రోల్ చేసుకోలేను.... అని సుధ తెలిపారు.

  అలా చేస్తే ఆత్మహత్య చేసుకునే వాడు కాదేమో?

  అలా చేస్తే ఆత్మహత్య చేసుకునే వాడు కాదేమో?

  ఉదయ్ కిరణ్ 9 సినిమాల్లో నా కొడుకుగా చేసే సరికి నిజంగానే మా మాధ్య తల్లి కొడుకుల ఫీలింగ్ పెరిగిపోయింది. వాడి ప్రవర్తన కూడా అలాగే ఉండేది. అమ్మా అమ్మా అని ఆప్యాయంగా పిలిచేవాడు. వాడు ఇలాంటి చెడు ఆలోచన(ఆత్మహత్య)కు వెళతాడని అనుకోలేదు. ఒక వేళ నేను దత్తత తీసుకుని ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో. దాన్ని ఇంకా మరిచిపోలేదు.... అని సుధ వెల్లడించారు.

  నా వద్దకు వచ్చి ఏడ్చేశాడు

  నా వద్దకు వచ్చి ఏడ్చేశాడు

  ఉదయ్ వాళ్ల తల్లి చనిపోయిన తర్వాత ఓసారి నన్ను కలిసేందుకు వచ్చాడు. అపుడు నేను ఏదో షూటింగులో ఉన్నాను. అమ్మను కలవాలి అని మా స్టాఫ్‌ను అడిగాడట. నా దగ్గర వాడికి మొహమాటం ఎందుకు రమ్మని చెప్పాను. వచ్చి చేతులు కట్టుకుని కింద కూర్చుని ఏడుస్తూ ఉండిపోయాడు. వాడంటే నాకు ప్రాణం. అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను. నేనూ ఏడ్చేశాను. ఏంట్రా... ఎందుకు ఏడుస్తున్నావ్? అని అడిగాను. మిమ్మల్ని చూస్తుంటే అమ్మ అని పిలవాలని ఉందని, మీతో అన్నీ చెప్పాలని అనిపిస్తుంది అన్నాడు. సరే చెప్పుకో అన్నాను.... ఏడుస్తూ ఉండిపోయాడే తప్ప ఏమీ చెప్పలేదు అని సుధ గుర్తు చేసుకున్నాడు.

   నా సొంత కొడుకులా చూసుకున్నాను

  నా సొంత కొడుకులా చూసుకున్నాను

  నా కొడుకు బంటీ అమెరికాలో ఉంటాడు. ఉదయ్ కిరణ్‌ కూడా పోలికల్లో నా కొడుకులాగే ఉంటాడు. వాడిని ఎలా చూసుకున్నానో ఉదయ్ కిరణ్‌ను అలాగే చూసుకున్నాను. వారిద్దరికీ ఒకటే తేడా. బంటీ నా కడుపున పుట్టాడు. ఉదయ్ కిరణ్ పుట్టలేదు... అని సుధ వెల్లడించారు.

   ఆ దర్శకుడు అనకూడని మాటలు అన్నాడు

  ఆ దర్శకుడు అనకూడని మాటలు అన్నాడు

  దర్శకుడు సెలవ్వరాఘవన్‌తో ‘7జి బృందావన్ కాలనీ'లో చిన్న గొడవ జరిగింది. ఆ రోజు వారికి ఇచ్చిన డేట్ కాదు. నైట్ వేరే షూటింగుకు వెళ్లిపోవాలి. పగటి పూట ఏదైనా సీన్లు ఉంటే కంప్లీట్ చేద్దాం అని అడిగితే వారు ఒప్పుకుంటేనే వెళ్లాను. 7 గంటలకు పంపుతామని చెప్పిన వారు 11 అయినా సరే రిలీవ్ ఇవ్వలేదు. డైరెక్టర్‌ను నేరుగా అడగలేం కాబట్టి కో డైరెక్టర్‌ను పిలిచి అడిగాను. ఈ విషయం డైరెక్టర్ ఎదురుగా ఉండి విన్నారు. వెంటనే నన్ను అనకూడని మాట అన్నారు.... అని సుధ తెలిపారు.

   నా సంగతి ఏమిటో చూపించా

  నా సంగతి ఏమిటో చూపించా

  అపుడు డైరెక్టర్‌కి ఒకేటే చెప్పాను. మీరు ఇలా మాట్లాడటం తప్పు. మిమ్మల్ని చూసి ఈ సినిమా ఒప్పుకోలేదు. నిర్మాత ఎఎం రత్నం మొహం చూసి ఒప్పుకున్నాను. అని చెప్పడంతో నాపై కోపం పెంచుకున్నారు. ఈ గొడవ జరిగిన వెంటనే నిర్మాత సెట్ కు వచ్చి సర్ది చెప్పి పంపారు. షూటింగ్ పూర్తయి డబ్బింగ్ సమయంలో సెల్వరాఘవన్ ఉంటే డబ్బింగ్ చెప్పను అన్నాను. అపుడు రత్నంగారు దగ్గరుండి డబ్బింగ్ చెప్పించుకున్నారు. తమిళ డబ్బింగులో డైరెక్టర్ నేను వద్దని వేరే ఆర్టిస్టులతో చెప్పించారు. ఎంతకీ సూట్ కాకపోవడంతో చివరకు నన్ను పిలిపించి చెప్పించుకోక తప్పలేదు అని సుధ గుర్తు చేసుకున్నారు.

  English summary
  Character Artist Sudha, who had a close bond with late Telugu actor Uday Kiran. She has made some fascinating facts about his passing in her recent interview.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more