»   »  రేటు పెంచిన ఛార్మీ

రేటు పెంచిన ఛార్మీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
చార్మీ తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి తెలుగు సినిమాలలోనే ఎక్కువగా నటిస్తోంది. నాలుగేళ్ల సమయంలో ఆమె 14 సినిమాలలో నటించింది. జూనియర్ నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఎన్టీఆర్ తదితరుల సినిమాలలో నటించిన చార్మీ తాజాగా బాపు సుందరకాండ సినిమాలో నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన మంత్ర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదంతా సరే కానీ ఆమె ఇకముందు నటించనున్న సినిమాలకు రూ.50 లక్షలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందిట. మరి ఆమె నిర్ణయాన్ని నిర్మాతలు ఆహ్వానిస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X