»   » విజయశాంతి టైటిల్ తో ఛార్మి

విజయశాంతి టైటిల్ తో ఛార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదారాబాద్: టి.కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి ప్రధానపాత్రలో వచ్చిన 'ప్రతిఘటన' ఎంత సంచలనం సృష్టించిందో గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే టైటిల్ తో ఛార్మి ప్రధానపాత్రలో మరో చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఆ చిత్రానికి ఈ చిత్రానికి టైటిల్ లో తప్ప మరి దేంట్లోనూ సంభధం లేదంటున్నారు.

దాదాపు ఫేడవుట్ దశలో ఉన్న ఛార్మి ఇప్పుడు మరో చిత్రం కమిటై చేస్తోంది. ఆ చిత్రంలో ఆమె జర్నలిస్టుగా కనిపిస్తోంది. ఒడిశాలో చోటుచేసుకొన్న ఓ సంఘటన ఆధారంగా దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. 'ప్రతిఘటన' అనే పేరుని నిర్ణయించారు.

ఇందులో ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తారని సమాచారం. ఆమె పోషించబోయేది పాత్రికేయురాలి పాత్ర. వర్తమాన సమాజంలో మహిళలపై సాగుతున్న అఘాయిత్యాలు, రాజకీయాల నేపథ్యంగా సాగే కథ ఇది. ఇప్పటికే కథ సిద్ధమైంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. ఇటీవలి కాలంలో ఛార్మి హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలు ఎక్కువగా చేస్తోంది. 'అనుకోకుండా ఒక రోజు', 'మంత్ర', 'మంగళ', 'ప్రేమ ఒక మైకం' ఈ తరహావే. ఆ జాబితాలోకే 'ప్రతిఘటన' కూడా చేరుతుంది.

''నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. కానీ ఎక్కడా వివాదాలకు తావుండదు. పూర్తి స్థాయి వాణిజ్య చిత్రమిది. ఈ కథ వినగానే ఉద్వేగానికి లోనయ్యాను. నా పాత్రను ప్రతి ఒక్కరూ అభినందిస్తారు'' అని ట్విట్టర్ ద్వారా ఈ చిత్రం వివరాలను చార్మి తెలియజేశారు.

మంత్ర, సుందరకాండ, మనోరమ, కావ్యాస్ డైరీ, సై ఆట, మంగళ, నగరం నిద్రపోతున్న వేళ వంటి స్త్రీ ప్రధాన చిత్రాల్లో నటించి నటిగా తన సత్తా ఏంటో ఇప్పటికే చాటారు చార్మి. ఆమె నటించిన మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం 'ప్రేమ ఒక మైకం' త్వరలో విడుదల కానుంది. అందులో ఆమె వేశ్య పాత్రతో మెప్పించబోతున్నారు.

English summary
Charmi Kaur has finalised her upcoming movie title Prathighatana and this movie will be directed by Thammareddy Bharadhwaja.This is touted to be lady centric film and it based on realistic incidents that happened in India.Charmi will essay the role of Journalist.Gopal Reddy is the cinematographer for this film. Charmi said"I am very happy to announce my next with Thammareddy.I am very much excited about it and my character will be bold and intense".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu