Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లి మ్యాటర్: దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పి చార్మి సెన్సేషన్
హైదరాబాద్: జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా' ప్రోగ్రాం కు గెస్ట్‌గా వచ్చిన చార్మి పలు సెన్సేషన్ కామెంట్స్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ లిస్టులో అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన సెలెబ్రిటీ ఎవరని అడిగిన క్వశ్చన్‌కు చార్మి దేవి శ్రీ ప్రసాద్ పేరు చెప్పింది. గతంలో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్తల నేపథ్యంలో ఆమె కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.
ఒక్క దేవిశ్రీ ప్రసాద్ గురించి మాత్రమే కాదు...ఇలియానా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇలియానాను మేకప్ లేకుండా అస్సలు చూడలేమంటూ వ్యాఖ్యానించింది. గతంలో ఇలియానా, చార్మి ...ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘రాఖీ' చిత్రంలో నటించిన సంగతి తెలిసింది.

ఇలియానా బక్కపలుచని సౌందర్యం ఇష్టపడని కొందరు చార్మి మాటలు నిజమే అని అంటుంటే.....ఇలియానా ఫ్యాన్స్ మాత్రం చార్మి ఇలా మరొకరి గురించి నెగెటివ్ కామెంట్స్ చేయడం తగదని అంటున్నారు. మరి చార్మి చేసిన కామెంట్ల విషయం ఇలియానా చెవిన పడ్డాయో? లేదో?
చార్మి గురించిన వివరాల్లోకి వెళితే...తెలుగులో పెద్ద సినిమాల్లో ఆమెకు అవకాశాలు రావడం లేదు. చిన్న చితకా సినిమాలు చేస్తూ కెరీర్ అలా సాగించేస్తోంది. ఇక ఇలియానా సౌత్ సినిమాలుకు గుడ్ బై చెప్పి బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆమె తొలి బాలీవుడ్ చిత్రం బర్ఫీ హిట్టవడం ఆమెకు...తర్వాత రెండు మూడు సినిమాల్లో అవకాశాలు తెప్పి పెట్టేలా చేసాయి. అయితే అవన్నీ ప్లాపు కావడంతో ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది.