»   » ఆ విషయంపై ఆయనకు చాలా క్లారిటీ ఉంది.. పూరీ జగన్నాథ్ గురించి చార్మీ

ఆ విషయంపై ఆయనకు చాలా క్లారిటీ ఉంది.. పూరీ జగన్నాథ్ గురించి చార్మీ

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం 'మెహబూబా'. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్స్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇండస్ట్రీలోను, అటు ఆడియన్స్‌లోను 'మెహబూబా' చిత్రంపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొని వున్నాయి. అందరి అంచనాలకు రీచ్‌ అయ్యేవిధంగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన దైన స్టైల్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ అధినేత దిల్‌ రాజు మే 11న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఏప్రిల్‌ 15న హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో ప్రెస్‌మీట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు, పూరి కనెక్ట్స్‌లో ఒకరైన ఛార్మి కౌర్‌, హీరో ఆకాష్‌, హీరోయిన్‌ నేహాశెట్టి, కెమెరామెన్‌ విష్ణుశర్మ, ఆర్ట్‌ డైరెక్టర్‌ జానీ షేక్‌, ఎడిటర్‌ జునైద్‌ సిద్ధిఖీ, ఫైట్‌ మాస్టర్‌ రియల్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛార్మి కౌర్‌ మాట్లాడుతూ..

   పూరి జగన్నాథ్ చాలా క్లారిటీగా

  పూరి జగన్నాథ్ చాలా క్లారిటీగా

  ‘పూరి జగన్నాథ్ చాలా క్లారిటీగా స్క్రిప్ట్‌ రాస్తారు. విజువల్స్‌, డైలాగ్స్‌ ప్రతిది సినిమా చూసినట్టు నేరేట్‌ చేస్తారు. ఈ సినిమాకి ది బెస్ట్‌ టెక్నీషియన్స్‌ అంతా వర్క్‌ చేశారు. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, ఎగ్జిక్యూషన్‌ డిపార్ట్‌మెంట్‌, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పూరిగారి మీదన్న ప్రేమతో వర్క్‌ చేశారు. వారందరికీ పేరు పేరునా నా థాంక్స్‌' అని ఛార్మి కౌర్‌ అన్నారు.

  హ్యాట్సాఫ్‌ ఆకాష్‌ పూరీ

  హ్యాట్సాఫ్‌ ఆకాష్‌ పూరీ

  ఆకాష్‌, నేహా, విషురెడ్డి ఫెంటాస్టిక్‌గా యాక్ట్‌ చేశారు. స్పెషల్‌గా ఆకాష్‌ యాక్షన్‌ సీన్స్‌, వార్‌, ఛేజ్‌ సీన్‌లలో చాలా డేర్‌గా రియల్‌గా నటించాడు. వార్‌ సీన్స్‌లో 800 సోల్జర్స్‌తో ఎక్స్‌లెంట్‌గా పెర్‌ఫార్మ్‌ చేశాడు. హ్యాట్సాఫ్‌ ఆకాష్‌ అని తెలిపారు.

  సోషల్ మీడియాలో ట్రైలర్‌ ట్రెండింగ్

  సోషల్ మీడియాలో ట్రైలర్‌ ట్రెండింగ్

  ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ దగ్గర్నుండీ, టీజర్‌, ట్రైలర్‌ వరకు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో 4 మిలియన్‌ వ్యూస్‌తో ట్రెండింగ్‌ అవుతోంది. మమ్మల్ని సపోర్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్‌. ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ 'ఓ ప్రియా.. నా ప్రియా' సాంగ్‌ని ఏప్రిల్‌ 16 సాయంత్రం 5 గంటలకు రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని మే 11న దిల్‌రాజుగారు రిలీజ్‌ చేస్తున్నారు. ఆయనకి స్పెషల్‌ థాంక్స్‌'' అని ఛార్మీ అన్నారు.

   పూరి జగన్నాథ్ సినిమా అంటే..

  పూరి జగన్నాథ్ సినిమా అంటే..

  దిల్‌ రాజుగారు సినిమా చూసి పూరిగారికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, హగ్‌ చేసుకొని 'ఇది పూరిగారి సినిమా అంటే... ఇది పూరిగారి సినిమా అంటే' అన్నారు. ఆయన జడ్జిమెంట్‌ కరెక్ట్‌గా వుంటుంది. సినిమా పై మాకున్న కాన్ఫిడెన్స్‌ మరింత పెరిగింది. స్మాల్‌ కాంటెస్ట్‌ని నిర్వహించి పూరి కనెక్ట్స్‌ ద్వారా బెస్ట్‌ టాలెంట్‌ని తీసుకున్నాం అని పూరి వెల్లడించారు.

  రిలీజ్‌కు ముందే క్రేజ్

  రిలీజ్‌కు ముందే క్రేజ్

  సినిమా చూసిన దిల్‌ రాజు 'ఎక్స్‌ట్రార్డినరీగా వుంది... ఇది పూరి సినిమా అంటే' అని యూనిట్‌ని అప్రిషియేట్‌ చేయడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. పూరి సంగీత్‌ ద్వారా ఈ చిత్రంలోని పాటలు రిలీజ్‌ కానున్నాయి. మెహబూబా టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే భారీ వ్యూస్‌ను సాధించాయి. దాంతో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్ కానున్నది.

  English summary
  Director Puri Jagannath is coming up with a new film titled 'Mehbooba' with his son, Akash Puri in the lead role. Its a romantic film set in the backdrop of India - Pakistan border. Most of the movie shot in Kashmir looks stunning. Neha Shetty is the female lead in the movie. Mehbooba is a crucial film for Puri Jagan who is going through the worst phase of his career.Sandeep Chowtha is composing music for the film. The film is expected to hit screens on May 11th.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more