For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూరి, నేను ఆ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పలేదు.. అతన్ని బావ అని పిలుస్తుంటా.. ఛార్మి ఎమోషనల్ కామెంట్స్

|

గతంలో వెండితెరపై హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మి.. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి వరుస సినిమాలు నిర్మిస్తోంది. ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలను నిర్మిస్తూ.. ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన పనుల్లో అన్నీ తానై భాగమవుతోంది. అయితే తాజాగా పూరి జగన్నాథ్ పుట్టిన రోజున ఛార్మి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ఆ వివరాలేంటో చూస్తే..

వరుస ఫ్లాప్‌లతో సతమతమై చివరకు

వరుస ఫ్లాప్‌లతో సతమతమై చివరకు

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ సినిమాలు రూపొందించిన పూరి జగన్నాథ్.. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమయ్యారు. చివరకు ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

విజయానందంలో సంచలన నిర్ణయం

విజయానందంలో సంచలన నిర్ణయం

ఇస్మార్ట్ శంకర్ విజయంతో మంచి జోష్‌లో ఉన్న పూరి జగన్నాథ్ తన పుట్టిన రోజు కానుకగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఒకటో, రెండో సినిమాలు తీసి వివిధ కారణాల వల్ల సినిమాలు చేయలేక పోతున్న దర్శకులు, అసిస్టెంట్ దర్శకులకు ఆర్థికంగా తోడ్బాటు అందించారు. ఛార్మితో కలిసి సంయుక్తంగా 20 దర్శకులకు ఆర్థిక సహాయం చేశారు.

పూరితో ఛార్మి పరిచయం.. ఆ తర్వాత

పూరితో ఛార్మి పరిచయం.. ఆ తర్వాత

ఈ కార్యక్రమంలో ఛార్మి పాల్గొని పూరితో తన పరిచయం, ఆ తర్వాత ప్రయాణం తదితర విషయాలు వెల్లడించింది. దాసరి నారాయణ రావు గారు నన్ను తన వారసుడని నమ్మారని, అలాంటి తాను ఏం చేస్తున్నానని పూరి ఎమోషనల్ అయ్యారని పేర్కొంది ఛార్మి. కేవలం సినిమాలు తీయడమేనా? నలుగురి మంచి కోసం మనం ఏం చేస్తున్నామని పూరి అనేవారని తెలిపింది.

నేను, పూరి ఇంతవరకూ ఎవ్వరికీ చెప్పలేదు

నేను, పూరి ఇంతవరకూ ఎవ్వరికీ చెప్పలేదు

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు తాము తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని, అయితే ఆ సీక్రెట్ ఇప్పటివరకూ ఎవ్వరికీ చెప్పలేదని ఛార్మి పేర్కొంది. కేవలం 50 వేలు కూడా చేతిలో లేవు. అలాంటి పరిస్థితుల్లో హీరో రామ్ ముందుకొచ్చి పూరితో సినిమా చేశాడు. అందుకే రామ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఒకరకంగా పూరి జగన్నాథ్‌ని, నన్ను ఆదుకున్నది హీరో రామ్ అని చెప్పింది ఛార్మి.

పూరి జగన్నాథ్ ధైర్యం చెప్పారు

పూరి జగన్నాథ్ ధైర్యం చెప్పారు

మనదగ్గర ఇవాళ డబ్బులు లేకపోవచ్చు. ఏం బాధ లేదు.. ఆరోగ్యంగా ఉందాం. నేను కథలు రాస్తా. నువ్వు నిర్మాణ బాధ్యతలు చూసుకో.. ఏం ఫర్వాలేదు.. అన్నీ పోతాయ్, అన్నీ వస్తాయ్ అని పూరి తనకు ధైర్యం చెప్పాడంటూ ఎమోషనల్ అయింది ఛార్మి. దీనంతటికీ కారణం రామ్. పూరీని ఆయన నమ్మడం వల్లే ఈ రోజు ఈ సహాయం చేయగలుతున్నాం అని చెప్పింది ఛార్మి.

అతన్ని బావ అని పిలుస్తుంటా

అతన్ని బావ అని పిలుస్తుంటా

దేవుడి దయ వల్ల ఆర్ధికంగా పుంజుకున్నాం. ఇక నుంచి పూరి పుట్టిన రోజైన ప్రతీ సెప్టెంబర్ 28న ఇలాంటి మంచి పని చేస్తామని ఛార్మి చెప్పింది. ఇక ఉత్తేజ్ గురించి మాట్లాడుతూ.. ఉత్తేజ్‌ని ముద్దుగా బావ అని పిలుస్తుంటానని, అతనే నన్ను పూరికి పరిచయం చేశాడని తెలిపింది ఛార్మి.

English summary
Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's hi voltege action seens saw in this movie. Now this movie will re release in theaters. Now puri jagannadh and Charmy Kaur takes a sensational decision.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more