»   »  రాశితో చేద్దామనుకుంటే..రేష్మితో కాపీ కొట్టేసి తీసేసారు, కోర్టుకు కేసు,కాపీ ఆధారాలు

రాశితో చేద్దామనుకుంటే..రేష్మితో కాపీ కొట్టేసి తీసేసారు, కోర్టుకు కేసు,కాపీ ఆధారాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఏదో ఒక భాషలో ఓ చిత్రం హిట్ అవుతుంది. దాని రైట్స్ ఒకరు తీసుకుంటారు. ఈ లోగా ఆ విషయం తెలుసో తెలియకో...తమ బాణీలో మక్కీ టు మక్కీ కాపీ కొట్టేస్తారు మరికొందరు. ఇప్పుడు అలాంటి వివాదంలోనే యాంకర్ రేష్మి తాజా చిత్రం ఇరుక్కుంది.

'గుంటూర్‌ టాకీస్‌' చిత్రంతో ఆకట్టుకొంది యాంకర్ రష్మి గౌతమ్‌. ఇప్పుడు 'చారుశీల'గా భయపెట్టబోతూ మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. రష్మి, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'చారుశీల'. శ్రీనివాస్‌ ఉయ్యూరు దర్శకుడు. ప్రముఖ దర్శకుడు సాగర్‌, శిద్దిరెడ్డి జయశ్రీ నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇప్పుడు రిలీజ్ ముందు ఈ చిత్రానికి ఓ సమస్య వచ్చింది. అదేమిటంటే కాపీ ఆరోపణ. ఈ చిత్రం తాము కొన్న తమిళ చిత్రం జూలీ గణపతి ని మక్కికి మక్కీ దింపేసి కాపీ చేసారంటూ ఓ దర్శకుడు కోర్టుకు వెళ్లి పోరాడుతూ అదే విషయాన్ని మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియచేసాడు.

కాపీ కొట్టారనే ఆధారాల ఫొటోలు, మరిన్ని వివరాలతో..

కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ..

కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ..

''బాలు మహేంద్ర దర్శకత్వంలో జయరామ్, సరిత జంటగా నటించిన తమిళ సినిమా 'జూలీ గణపతి'ని తెలుగులో రీమేక్ చేయాలని డబ్బింగ్, రీమేక్ రైట్స్ కొన్నాను.మా కథను చోరీ చేసి 'చారుశీల' తీశారు'' అని కూనిరెడ్డి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు.

నిర్లక్ష్యం

నిర్లక్ష్యం


ఆధారాలతో సహా 'చారుశీల' దర్శక-నిర్మాతలను సంప్రదించగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు.

డబ్బింగ్ కూడా చేయలేదు

డబ్బింగ్ కూడా చేయలేదు

స్టార్ ఆర్టిస్టులతో రీమేక్ చేయాలని డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయలేదు.

టైటిల్ రిజిస్ట్రేషన్

టైటిల్ రిజిస్ట్రేషన్


ఈ సినిమా కోసం 'శూర్పణక' టైటిల్ కూడా రిజిస్టర్ చేయించా.

డౌట్ వచ్చింది

డౌట్ వచ్చింది


మేలో 'చారుశీల' స్టిల్స్ చూడగా సందేహం కలిగింది. వెంటనే ఎలర్ట్ అయ్యా

ఫస్ట్ కాపీ వచ్చాక

ఫస్ట్ కాపీ వచ్చాక


చిత్ర నిర్మాత సాగర్‌గారిని సంప్రదిస్తే, ఫస్ట్ కాపీ వచ్చాక చూద్దామన్నారు.

స్పందన లేదు

స్పందన లేదు


ట్రైలర్ అయితే మక్కీకి మక్కీ కాపీ. వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు

కోర్టు కు వెళ్లా

కోర్టు కు వెళ్లా


స్పందన లేకపోవడంతో వేరే దారి లేక కోర్టును ఆశ్రయించా.

ఈ లోగా రిలీజ్ డేట్

ఈ లోగా రిలీజ్ డేట్


ఇంతలో ఈ నెల 18న 'చారుశీల' విడుదల అని ప్రకటించారు. బయ్యర్లకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ప్రెస్‌మీట్ పెట్టాను. న్యాయం జరిగే వరకూ పోరాడతాను'' అని చెప్పారు.

పోస్టర్స్ ద్వారా

పోస్టర్స్ ద్వారా


సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో చారుశీల పోస్టర్స్ చూశాను. నా సినిమా కథకు దగ్గరి పోలికలు ఉండటంతో న్యాయం కోసం చారుశీల నిర్మాతలను సంప్రదించాను.

ఎలా వాడుకుంటారు

ఎలా వాడుకుంటారు

జూలీ చిత్రం డబ్బింగ్‌, రీమేక్‌ రైట్స్‌ను తాను తీసుకున్నానని తెలిపారు. తన అనుమతి లేకుండా చారుశీల చిత్రంలో 'జూలీ' కథను ఎలా వాడుకుంటారని ప్రశ్నించారు.

English summary
Producer Kunireddy Srinivas has Complaint of Rashmi Gautham's Charusheela Movie Scenes are Copied from Jooli Ganapathy Movie. He has the Rights for the Movie and need to be sufficient remuneration under Copyright.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu