»   » అల్లరి నరేష్ లాంచ్ చేసిన ఆడియో: డైరక్టర్ అరెస్ట్, ఫోర్జరీ చేసి సినిమా అమ్మకం

అల్లరి నరేష్ లాంచ్ చేసిన ఆడియో: డైరక్టర్ అరెస్ట్, ఫోర్జరీ చేసి సినిమా అమ్మకం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా 'వాడు వీడు ఓ కల్పన' చిత్రం ఆడియో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోకు తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఏపీ మంత్రి మాణిక్య‌లరావు, సినీనటులు సుమన్‌, అల్లరి నరేష్‌ తదితరులు హాజరయ్యారు. అయితే ఇప్పుడీ సినిమా దర్సకుడుని పోలీసులు అరెస్ట్ చేసారు.

ఏకంగా నిర్మాత సంతకాన్నే పోర్జరీ చేసి సినిమాని దర్శకుడే అమ్మేస్తే పరిస్దితి ఏమిటి...అదే టాలీవుడ్ దర్శకుడు చేసాడు. నిర్మాత ఇచ్చిన పోలీస్ కంప్లైట్ మేరకు ఆ దర్సకుడుని హైదరాబాద్ పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు.

పోలీసుల చెప్తున్న దాని ప్రకారం...... అమీర్‌పేట లోని జానా రామారావు అనే సినీ నిర్మాత...మహంతి పి.కె అలియాస్ మహంతి పద్మారావు(35) అనే దర్శకుడుతో కలిసి భారీ మొత్తం ఖర్చుపెట్టి 'అమ్మయిలూ టేక్ కేర్' అనే సినిమా తీశారు.

Cheating case against Tollywood Producer

అయితే సినిమా రిలీజ్ చేసే సమయంలో నిర్మాతకు ట్విస్ట్ పడింది. దర్శకుడు మహంతి ఫిలింనగర్‌కు చెందిన సతీష్ చౌదరికి నిర్మాత ఫోర్జరీ సంతకంతో సినిమా హక్కులు అమ్మేశాడు.అంతటితో ఆగకుండా సినిమా పేరును 'వాడు వీడు ఓ కల్పన' అని మార్చి ఈనెల 10న ఆడియో రిలీజ్ చేశారు.

దాంతో విషయం తెలుసుకున్న నిర్మాత జానా రామారావు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డెరైక్టర్ మహంతిని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కాగా సినిమా హక్కులను కొన్న సతీష్ చౌదరి, కేసుతో సంబంధం ఉన్న కృష్ణ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

'వాడు వీడు.. ఓ క‌ల్పన‌' చిత్రం విషయానికి వస్తే.. స్మార్ట్ ఇన్వెస్టర్స్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొండ్రెడ్డి స‌తీష్ చౌద‌రి నిర్మాత‌గా, మ‌హంతి పీకే ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన‌ మూవీ 'వాడు వీడు.. ఓ క‌ల్పన‌'. 19 ఏళ్లుగా సినీ ప‌రిశ్రమ‌లో ప‌లువురు సీనియ‌ర్ ద‌ర్శకుల ద‌గ్గర అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్, కోడైరెక్టర్‌గా ప‌ని చేసిన అనుభ‌వంతో తాజాగా 'వాడు వీడు.. ఓ క‌ల్పన‌' చిత్రంతో మ‌హంతి పీకే ద‌ర్శకుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు.

Cheating case against Tollywood Producer

సోష‌ల్ యూత్‌ఫుల్ క‌మిట్‌మెంట్‌కి క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించి అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌కు ల‌వ్.. సెంటిమెంట్.. కామెడీ.. ఫ్యామిలీ.. థ్రిల్లర్.. ఇవే కాకుండా ప్రేక్షకుడు ఊహించ‌ని మ‌రో ఫీలింగ్ ను త‌మ సినిమాలో చూపించ‌బోతున్నామ‌ని డైరెక్టర్ మ‌హంతి పీకే, నిర్మాత కొండ్రెడ్డి స‌తీష్ చౌద‌రి తెలిపారు.

విష్ణురెడ్డి, వ‌ర్ధన్‌రెడ్డి, ఐరా, ప్రియా ప్రధాన పాత్రలుగా కృష్ణభ‌గ‌వాన్, ధ‌న్‌రాజ్, స‌నా, గీతాసింగ్‌, క‌త్తి మ‌హేష్‌, మారుతి, అల్లరి సుభాషిణి, రాధాకృష్ణ‌, జ‌బ‌ర్ధస్త్ స‌తీష్, ర‌మ‌ణి.. త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల వేడుక‌ల ఈ నెల‌ 10న ప్రసాద్ ల్యాబ్‌లో సినీ రాజ‌కీయ ప్రముఖుల మ‌ధ్య జ‌రిగింది.

Cheating case against Tollywood Producer

అన్నిహంగులు జోడించుకుని ముస్తాబ‌వుతున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల‌లో పాటు, ఓవ‌ర్సీస్ అంత‌టా భారీగా విడుద‌ల చేస్తున్నట్టు నిర్మాత కొండ్రెడ్డి స‌తీష్ చౌద‌రి తెలిపారు.

హీరో అల్ల‌రి న‌రేష్ మాట్లాడుతూ.. త‌మ సినిమాల‌కు ప‌ని చేసిన మ‌హంతి.. ఈ సినిమాతో డైరెక్ట‌ర్ కావ‌డం చాలా సంతోష‌మ‌న్నారు. సినిమా బిగ్ స‌క్సెస్ అవుతుంద‌ని ఆకాంక్షించారు.

English summary
Vaadu Veedu o Kalpana director Mahanthi arrested by Hyderabad police.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu