»   » రాజేంద్రప్రసాద్ భార్యపై కేసు పెట్టిన సినీ డిస్ట్రిబ్యూటర్, అసలు ఏం జరిగింది?

రాజేంద్రప్రసాద్ భార్యపై కేసు పెట్టిన సినీ డిస్ట్రిబ్యూటర్, అసలు ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ భార్య విజయ ఛాముండేశ్వరి కోర్టు చిక్కుల్లో ఇరుకున్నారు. ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్ జయభరత్ రెడ్డి విజయ ఛాముండేశ్వరిపై కేసు పెట్టారు.

రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫోటోస్ చూసేందుకు క్లిక్ చేయండి

రూ. 25 లక్షల అప్పుకు సంబంధించి ఏర్పడిన వివాదమే ఈ కేసు పెట్టడానికి కారణం అయింది. ఈ కేసుకు సంబంధించి అందింన వివరాల ప్రకారం విజయ ఛాముండేశ్వరి జయభరత్ రెడ్డి వద్ద 2013లో రూ. 25 లక్షలు అప్పుగా తీసుకున్నారు. డబ్బు తిరిగి ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పిన ఆమె మాట తప్పినట్లు తెలుస్తోంది.

Check bounce case on Rajendra Prasad's wife

అప్పు తిరిగి ఇవ్వడంలో భాగంగా చివరకు 2016 జూన్‌లో 10ల‌క్ష‌లు, 15ల‌క్ష‌లు విలువ చేసే రెండు చెక్‌లు ఇచ్చారు. అవి ఆస్టులో మెచ్యూర్ అవుతాయ‌ని చెప్పారు. అయితే ఆ చెక్కులు బౌన్స్ కావడంతో జయభరత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఫిబ్ర‌వ‌రి 21న విచారించ‌నున్నారు.

ఇక నటుడు రాజేంద్రప్రసాద్ కెరీర్లో అందరికీ గుర్తుండిపోయే సినిమా 'అప్పుల అప్పారావు'. అందులో అందరి వద్ద అప్పులు చేసి ఎగ్గొట్టే అప్పరావుగా ఆయన అందరినీ నవ్వించింది. అయితే రియల్ లైఫ్ లో రాజేంద్రప్రసాద్ అప్పుకు తీసుకుని కోర్టు చిక్కల్లో ఇరుక్కోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.

English summary
Tollywood actor, MAA President Rajendra Prasad's wife Vijaya Chamnudeswari got involved in check bounce case. Jayabharat Reddy approached court and his lawyer arguing his case said it was painful that the checks bounced. Court postponed the case to Feb 21st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu