»   » నాగ్-రాఘవేంద్రరావు మూవీ: స్వామి వారిని పరిచయం చేసారు.. (ఫోటోస్)

నాగ్-రాఘవేంద్రరావు మూవీ: స్వామి వారిని పరిచయం చేసారు.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అదో గొప్ప భక్తిరస చిత్రం కాబోతోంది అనేది ప్రజల్లో నమ్మకం. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి లాంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం.

తాజాగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్‌ బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను నటుడు సౌరభ పోషిస్తున్నారు.


రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన గత భక్తిరస చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తున్నారు. స్లైడ్ షోలో ఫోటోస్, మోషన్ పోస్టర్...


స్వామి వారిని పరిచయం చేసారు

స్వామి వారిని పరిచయం చేసారు

ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది.


మరో గొప్ప భక్తిరస చిత్రం

మరో గొప్ప భక్తిరస చిత్రం

తెలుగు సినీ పరిశ్రమలో ఇది మరో గొప్ప భక్తిరస చిత్రం కాబోతోందని అంటున్నారు.


నాగార్జున

నాగార్జున

గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి పాత్రల్లో అలరించిన నాగార్జున ఈ సారి హథీరామ్‌ బాబాగా అదరగొట్టబోతున్నారు.


rn

మోషన్ పోస్టర్

ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


English summary
Om Namo Venktatesaya Latest Telugu Movie motion poster. Glimpse of Lord Venkateswara. Sourabh Raaj Jain played the role of Lord Venkateswara. The movie starring Akkineni Nagarjuna and Anushka. Music for this Devotional movie is composed by MM Keeravani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu