»   » "మౌన గురు" హిందీలో ఎలా ఉండబోతోంది: అకిరా ఫస్ట్ లుక్ కి అనూహ్య స్పందన

"మౌన గురు" హిందీలో ఎలా ఉండబోతోంది: అకిరా ఫస్ట్ లుక్ కి అనూహ్య స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో దర్శకుడిగా మురుగదాస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా హిందీలో గజినీ .. హాలిడే వంటి చిత్రాలను తెరకెక్కించిన మురుగదాస్, మూడవ సినిమాగా 'అకీరా'ను సిద్ధం చేస్తున్నాడు. సోనాక్షీ సిన్హా ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా నుంచి నిన్న ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అకీరా. ఈ మూవీ పోస్టర్‌ను సోనాక్షి తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. 2011లో తమిళంలో వచ్చిన మౌనగురు చిత్రానికి రీమేక్‌గా అకీరా తెరకెక్కుతోంది.

ఇందులో సోనాక్షితో పాటు శతృఘ్న సిన్హా, కొంకణా సెన్‌ శర్మ, ఊర్మిళా మహంతా, అమిత్‌ సాద్‌, అనురాగ్‌ కశ్యప్‌, మిథున్‌ చక్రవర్తి నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనాక్షీ పేస్ పై 'అకీరా' లెటర్స్ ను కట్ చేసిన తీరుకి నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఇటీవల మురుగదాస్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మహేశ్ బాబు సినిమాపై దృష్టి పెట్టాడు. దాంతో బాలీవుడ్ లో 'అకీరా' అటక ఎక్కేసినట్టేననే ప్రచారం మొదలైందట. ఈ నేపథ్యంలో ఈ సినిమాను సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్టు చెబుతూ, ఫస్టు పోస్టర్ ను వదిలారని చెప్పుకుంటున్నారు. అనురాగ్ కశ్యప్ తో కలిసి మురుగదాస్ నిర్మిస్తోన్న ఈ సినిమా, దర్శక నిర్మాతగా ఆయనకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

English summary
Actress Sonakshi Sinha took to Twitter to share the teaser poster of her upcoming film Akira. Directed by AR Murugadoss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu