For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈ ‘చెత్త’ అదిరింది: మీరూ చూస్తారా?(వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్ :‘ఆగడు'కు పాడిన ‘ఆజా సరోజా' పాట ఎంత హిట్టైందో తెలిసిందే. ఆ పాట పాడిన గాయకుడు ఇప్పుడు తన స్వంత ఆల్బమ్ తో మన ముందుకు వస్తున్నారు. గాయకుడిగా తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న రాహుల్‌ నంబియార్‌ ఇప్పుడు ‘ట్రాష్‌' అనే మ్యూజిక్‌ సింగిల్‌తో సంగీత ప్రియుల ముందుకు వస్తున్నారు.

  మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ పాటను ఆయన విడుదల చేస్తున్నారు. తెలుగులో ఆ ఆల్బమ్‌కు ‘చెత్త' అనే టైటిల్‌ పెట్టారు. మిగతా భాషల కంటే తెలుగులోనే మొదటిసారిగా దాన్ని ప్రసాద్‌ ల్యాబ్స్‌ ప్రివ్యూ థియేటర్‌లో సంగీత దర్శకుడు తమన్‌ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.ఆ పాటను మీరు వినాలంటే...ఈ క్రింది వీడియోని క్లిక్ చేసి చూడండి.

  మానవ సంబంధాల్లో నిండిపోయిన చెత్తను తీసెయ్యండి అని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో సాంగ్‌ అని రాహుల్‌ నంబియార్‌ అంటున్నారు. దీనికి నా సొంత జీవితంలోని సంఘటనలే ప్రేరణ. మన అనుభవాల నుంచే మనం ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం. నా జీవితంలో హార్ట్‌బ్రేకింగ్‌ సంఘటనలున్నాయి. అయితే వాటిపై లోతుగా వెళ్లదలచుకోలేదు. మన హృదయంలో ఏవైనా బాధలుంటే వాటిని బయటకు విసిరేసి, ఆనందంగా ఉండమని చెబుతున్నా.

  ఒక సంగీతకారుడిగా నా ఫీలింగ్స్‌ను వ్యక్తం చెయ్యాలనుకుంటా. అందుకే దీని ఖర్చంతా నేను పెట్టుకున్నా. నేనే పాటను కంపోజ్‌ చేశాను. నేనే రికార్డ్‌ చేసుకున్నాను. నేనే మలయాళం, తమిళంలో సాహిత్యం రాశాను. వీడియోలో నటించాను. వీటియో ఎడిటింగ్‌లోనూ పాలు పంచుకున్నాను. జనం దీన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా దీన్ని చూసినవాళ్లంతా ప్రశంసించారు. ఇందులో నాతోపాటు సుజాకుమార్‌ నటించింది.

  CHETHTHA - Telugu Single by Rahul Nambiar

  తమన్‌ మాట్లాడుతూ, ఈ వీడియో కోసం రాహుల్‌ ఒకటిన్నర సంవత్సరం ఎంతో కష్టపడ్డారని, ఇందులో ఆయన నటించడం ఓ విశేషమని అన్నారు.

  'చెత్త' వీడియోకి సాహిత్యాన్ని అందించిన అనంతశ్రీరామ్‌ మాట్లాడుతూ, 'సాధారణంగా దర్శక, నిర్మాతలు నన్ను కొత్తగా పాటలు రాయమని అడుగుతారు. కానీ రాహుల్‌ నంబియార్‌ మాత్రం చెత్తగా రాయమన్నారు. తమిళంలో ఆయన రాసిన పదాలను తెలుగులో నేను రాశాను తప్ప నేను కొత్తగా రాసింది ఏమీలేదు' అని అన్నారు.

  రాహుల్‌ నంబియార్‌ మాట్లాడుతూ, 'సంగీతాన్ని నేను ఫ్యాషన్‌గా నేర్చుకున్నానే తప్ప వృత్తిగా తీసుకోవాలని అనుకోలేదు. ఈ వీడియోకి సంబంధించి కంపోజింగ్‌, ప్రోగ్రామింగ్‌ చేయడమే కాకుండా దీనిని నేనే నిర్మాతగా చేశాను. అయితే భవిష్యత్తులో సినిమాలకు సంగీతం చేయాలన్న ఉద్దేశ్యం లేదు. చెత్త అన్నది ప్రేమలో కావచ్చు, భార్యాభర్తల బంధంలో కావచ్చు..మరేదైనా కావచ్చు.. సమాజంలో పేరుకుపోయిన చెత్త కావచ్చు. దీన్ని ఓ పాట రూపంలో చెప్పాం' అని అన్నారు.

  English summary
  A Single by RAHUL NAMBIAR featuring Lady Kash & Krissy. TRASH is a collection of my first SINGLE in 4 languages. Apart from KUPPAA in Malayalam, the same song has been done in Tamil (KUPPAI), Hindi (KACHRA) & Telugu (CHETHTHA).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X