»   » సమంత ఏడిపించింది.. తట్టుకోలేక భోరున ఏడ్చాను..

సమంత ఏడిపించింది.. తట్టుకోలేక భోరున ఏడ్చాను..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సమంత త్వరలోనే అక్కినేని ఇంటి కోడలు కానున్నది. నాగచైతన్య అక్కినేనితో సమంత వివాహం అక్టోబర్‌లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి ముందు సమంత నటించిన చిత్రం రాజు గారి గది 2. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ఉద్వేగ భరితమైనదనే వార్తలు ఫిలింనగర్‌లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా గాయని చిన్నయి శ్రీపాద ఆసక్తికరమైన విషయాన్ని పంచుకొన్నది.

సమంతకు చిన్మయి డబ్బింగ్

సమంతకు చిన్మయి డబ్బింగ్

గాయనిగా కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు చిన్మయి శ్రీపాద. సమంత అద్భుతమైన నటనకు తన డబ్బింగ్‌తో ఆమె ప్రాణం పోస్తారు. సమంత సినిమాలకు చిన్మయి తప్ప మరొకరు డబ్బింగ్ చెప్పరు. ఈ నేపథ్యంలో రాజుగారి గది 2 చిత్రంలో సమంత పాత్రకు కూడా ఆమె డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా సమంత నటన చూసి ఉద్వేగానికి లోనయినట్టు ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నది.

ఆత్మ పాత్రలో సమంత

ఆత్మ పాత్రలో సమంత

రాజు గారి గది 2లొ ఆత్మ పాత్రలో సమంత కనిపించనున్నారు. ఆ పాత్రకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. అయితే ఈ సందర్భంగా సమంత ఫర్ఫార్మెన్స్ చూసి తాను కంటతడి పెట్టుకొన్నాను అని చిన్మయి ట్వీట్ చేసింది. ఆమె నటనను చూసి తట్టుకోలేకపోయాను అని వివరించింది. సమంత నటనపై చిన్మయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నది.

చివరకు దు:ఖాన్ని ..

రాజుగారి గదిలో సమంత ప్రభు పాత్రకు డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్ చెప్తూ చివరకు దు:ఖాన్ని దిగమింగుకోలేకపోయాను. భోరుమని ఏడ్చాను. ఆమె తన నటనతో చంపేసింది అని ట్విట్టర్‌లో చిన్మయి పేర్కొన్నది.

కొత్త అనుభూతిని

కొత్త అనుభూతిని

చిన్మయి శ్రీపాద చెప్పిన ప్రకారం.. రాజు గారి గదిలో సమంత నటన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత రాజు గారి గది చిత్రంలోని పాత్ర సమంతకు మంచి అనుభూతిని మిగిల్చే అవకాశం ఉంది.

అక్టోబర్ 13న

అక్టోబర్ 13న

ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది2 చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమవుతున్నది. అక్కినేని నాగార్జున, సీరత్ కపూర్, సమంత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ రీసెంట్ గా విడుదలై అభిమానులలో భారీ అంచనాలు పెంచింది.

English summary
Chinmayi Sripaada is popular singer and dubbing artist. She dubs for Samantha Prabhu regularly. While dubbing for Raju gari Gadhi2. She gets emotional. Chinmayi tweeted that I dubbed for Samanthaprabhu2 in Raju Gari Gadhi 2 and ended up crying while dubbing for her. She killed it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu