»   » చిన్మయికి చేదు అనుభవం: మౌనం వద్దు... చెంప చెల్లుమనిపించాలన్న టాప్ సింగర్

చిన్మయికి చేదు అనుభవం: మౌనం వద్దు... చెంప చెల్లుమనిపించాలన్న టాప్ సింగర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
మౌనం వద్దు... చెంప చెల్లుమనిపించాలన్న టాప్ సింగర్

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద వేధింపులకు గురయ్యారు. ఆదివారం(మార్చి 12) ఓ ఈవెంటులో పాల్గొన్న ఆమెను కొందరు ఆకతాయిలు చుట్టిముట్టి ఇబ్బంది పెట్టారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి చిన్మయి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని సూచనలు కూడా చేశారు.

 చాలా ఇబ్బంది పడ్డాను, షాకయ్యాను

చాలా ఇబ్బంది పడ్డాను, షాకయ్యాను

నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నాను. అక్కడ నన్ను కొందరు చుట్టు ముట్టారు. దీంతో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ సంఘటన గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేశాను. ఎంతో మంది మహిళలు, పురుషులు వారు చిన్న పిల్లలుగా ఉన్నపుడు వేధింపులకు గురయ్యారనే విషయం తెలిసి షాకయ్యాను.... అని చిన్మయి వెల్లడించారు.

 ఎవరూ వాటిని నమ్మడం లేదు

ఎవరూ వాటిని నమ్మడం లేదు

ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వారి సొంత ఇల్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌లో చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనల గురించి చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా పంచుకోవడానికి ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే ఎవరూ వాటిని నమ్మడం లేదు అని చిన్మయి తెలిపారు.

బయటకు చెబితే బ్లేమ్ చేస్తున్నారు

బయటకు చెబితే బ్లేమ్ చేస్తున్నారు

చాలా మంది పురుషులు బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి పంచుకోవడానికి సిగ్గుగా ఫీలవుతారు. మహిళలు ఇందుకు సంబంధించిన సంఘటల గురించి ధైర్యంగా చెప్పడానికి ముందుకు వస్తే ‘ఆమె వాటిని ఎంజాయ్ చేసింది' అని బ్లేమ్ చేస్తున్నారు... అని చిన్మయి అభిప్రాయ పడ్డారు.

మహిళలు తక్కువేం కాదు

మహిళలు తక్కువేం కాదు

కొన్ని సందర్భాల్లో వేధింపులకు గురైన మహిళల పట్ల ఇతర మహిళ ప్రవర్తించే తీరు కూడా సరిగా ఉండటం లేదు. నీవు వేసే డ్రెస్సుల వల్ల ఇలా జరిగింది అని నిందిస్తున్నారు. ముందు మహిళలకు ఈ విషయాల్లో ఎలా ప్రవర్తించాలి అనే దానిపై ట్రైనింగ్ ఇవ్వాలి..... అని చిన్మయి అభిప్రాయ పడ్డారు.

 బయటకు చెబితే ఆక్షలు విధిస్తారనే భయం

బయటకు చెబితే ఆక్షలు విధిస్తారనే భయం

తమకు ఎదురైన సంఘటనల గురించి ఆడ పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పడానికి భయ పడుతున్నారు. ఇలాంటి జరుగుతున్నాయని తెలిస్తే చదువు లేదా పని మానేసి ఇంట్లోనే ఉండి పొమ్మంటారనే భయం చాలా మందిలో ఉంది అని చిన్మయి శ్రీపాద ట్వీట్ చేశారు.

 దయచేసి అలా చేయడం ఆపండి

దయచేసి అలా చేయడం ఆపండి

దయచేసి లైంగిక వేధింపులకు గురైన బాధితులను... వారి లిప్‌స్టిక్, జుట్టు, స్కిన్ కలర్, దుస్తులు, ప్రవర్తన, టాలెంట్, ఇంటిలిజెన్స్ లాంటి విషయాల్లో బ్లేమ్ చేయడం ఆపండి అని... చిన్మయి ట్వీట్ ద్వారా కోరారు.

అనుమతి లేకుండా తాకితే చెంప పగలకొట్టండి

అనుమతి లేకుండా తాకితే చెంప పగలకొట్టండి

మీ అనుమతి లేకుండా ఎవరైనా మిమ్మల్ని తాకితే.... వెంటనే నిలదీయండి, అరవండి, చెంప చెల్లుమనిపించండి అని చిన్మయి శ్రీపాద సూచించారు. మనల్ని ఎవరైనా చుట్టుముట్టినపుడు ఏం చేయాలో అర్థంకాక సైలెంట్ అయిపోతాం. నేను కూడా అలాగే అయ్యాను. ఇలా మౌనంగా ఉండటం వల్ల మనల్ని వేధింపులకు గురి చేసే వారు అడ్వాంటేజీగా తీసుకుంటారు.... అని చిన్మయి తెలిపారు.

English summary
Actress Chinmayi has taken to her Twitter space to share that she was groped at an event yesterday (March 11), and the talented singer shared her shocking feelings about it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu