»   » ట్విట్టర్లోనే సమంతా ముద్దులు.... ఈ ఆలూ సమోసా బంధం ఏమిటో

ట్విట్టర్లోనే సమంతా ముద్దులు.... ఈ ఆలూ సమోసా బంధం ఏమిటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఏ మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లో రంగప్రవేశం చేసినప్పటి నుంచి టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది చెన్నై సుందరి సమంత. అప్పట్లో ఆమె నటించిన సినిమాలన్నీ భారీ విజయాలు సాధించి ఆమెకు స్టార్‌ స్టేటస్‌ అందించాయి. సమంత ఈ స్థాయి విజయం సాధించడం వెనక ఆమె పాత్ర ఎంత ఉందో.. మరో వ్యక్తి పాత్ర కూడా దాదాపు అంతే ఉంది. ఆమె పేరు చిన్మయి శ్రీపాద. "స్వామీ నదికి పోలేదా" అన్న డైలాగ్ కి చిన్మయి డబ్బింగ్ తో సమంతా ఎంతటి మ్య్యజిక్ చేసిందో తెలిసిందే కదా. సమంతా చిన్మయి ఇద్దరిదీ అందమైన రూపం. ఇద్దరినీ విడదీసి చూడలేమన్నట్టుగా ఉండే వీరిద్దరికి మంచి సంబంధం ఉంది. ఎలాగంటే.. తొలి చిత్రం నుంచీ సమంతాకు చిన్మయి తన గొంతును అరువిస్తోంది.

అయితే...! జనతా గ్యారేజ్ విడుదల సంధర్భనా ఈ ఇద్దరూ ట్విట్తర్ లో పెట్టిన పోస్టులు ఇప్పుడు అందరినీ అలరిస్తున్నాయి.'నటిగా నాకు మంచి పేరొచ్చింది చిన్మయి గొంతు వల్లే' అని చాలాసార్లు చెప్పింది సమంతా.ఆమె నటించిన 'బృందావనం, ఆటోనగర్‌ సూర్య, జబర్దస్త్‌' సినిమాలకి తప్ప మిగతా అన్నింటికీ చిన్మయి నే డబ్బింగ్‌ చెప్పింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఇద్దరూ కలిసి నవ్వులు పంచారు. ఇంతకీ ఈ ఇద్దరూ ఏం చేసారూ అంటే...

మొదటి నుంచీ:

మొదటి నుంచీ:

సమంతకు మొదటి సినిమా నుంచీ డబ్బింగ్‌ చెబుతున్నది చిన్మయే. ఆమె వాయిస్‌ కూడా ఎంత పాపులరో తెలిసిందే. తాజాగా ‘జనతా గ్యారేజ్‌'లో కూడా సమంత పాత్రకు డబ్బింగ్‌ చెప్పింది చిన్మయి.

లాలూ స్టైల్లో:

లాలూ స్టైల్లో:

ఈ సినిమా విడుదల సందర్భంగా సమంతకు ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ చెప్పింది. అదీ ఎలా అంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ స్టైల్లో

జబ్ తక్:

జబ్ తక్:

"జబ్ తక్ సమోసా మే ఆలూ రహేగా తబ్ తక్ బిహార్ మే లాలూ రహేగా" (సమోసాలో ఆలూ ఉఇన్నంత వరకూ బీహార్ లో లాలూ ఉంటాడు) అని గతం లో లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిన డైలాగ్ స్టైల్లోనే

సామ్‌ పాపకు:

సామ్‌ పాపకు:

జనతా గ్యారేజ్‌ విడుదల సందర్భంగా సామ్‌ పాపకు బెస్టాఫ్‌ లక్‌. సమోసాలో ఆలూ ఉన్నంతవరకు సమంతకు డబ్బింగ్‌ చెప్పేది నేనే' అంటూ ఆమె ట్విట్టర్‌లో కామెంట్‌ చేసింది. ఈ ట్వీట్ కే నవ్వుతున్న నెటిజన్లు ఇక సమంతా చేసిన రీట్వీట్ కి ఇంకా నవ్వుకున్నారు.

నాలుగు ముద్దులను కూడా:

నాలుగు ముద్దులను కూడా:

కొద్దిసేపటికే సమంత కూడా రీట్వీట్‌ చేసింది. ‘హాహా.. థాంక్స్‌ పాపా' అంటూ చెప్పి ఆగిపోకుండా నాలుగు ముద్దులను కూడా పోస్ట్‌ చేసింది సమంత. అంతే ఈ ఆలూ సమోసా భందానికి... ఈ చిలిపి పాపల ఆటలకూ అంతా నవ్వుకుంటున్నారు.

సింగ‌ర్‌:

సింగ‌ర్‌:

చిన్మయి సింగ‌ర్‌గా చాలా పాట‌ల‌కి ప్రాణం పోసింది. అలాగే ఏమాయ చేశావే మూవీలో స‌మంతా పాత్రకి క్యూట్‌గానూ, హ‌స్కి వాయిస్‌తో డ‌బ్బింగ్ చెప్పి మ‌రింత పాపులారిటిను సంపాదించుకుంది.

స‌మంతా క్యారెక్టర్‌కి చిన్మయి వాయిస్:

స‌మంతా క్యారెక్టర్‌కి చిన్మయి వాయిస్:

ఆ మూవీ నుండి చిన్మయి వాయిస్ ఇండ‌స్ట్రీలోనూ, అభిమానుల‌లోనూ మ‌రింతగా పాపుల‌ర్ అయింది. అప్పటి నుండి స‌మంతా క్యారెక్టర్‌కి చిన్మయి వాయిస్ తోడైతే ఆ పాత్రకి ప్రాణం పోసిన‌ట్టు ఉంటుంద‌ని అంద‌రూ చెబుతుంటారు.

స్వామీ నదికి పోలేదా:

స్వామీ నదికి పోలేదా:

సమంత ఈ స్థాయి విజయం సాధించడం వెనక ఆమె పాత్ర ఎంత ఉందో.. చిన్మయి శ్రీపాద పాత్ర కూడా దాదాపు అంతే ఉంది.. "స్వామీ నదికి పోలేదా" అన్న డైలాగ్ కి చిన్మయి డబ్బింగ్ తో సమంతా ఎంతటి మ్య్యజిక్ చేసిందో తెలిసిందే.

English summary
Chinmayi Sripada and samantha Naughty Twitter conservation about Janatha Garage
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu