»   » 150వ సినిమా కోసమే... చిరు ఆపరేషన్

150వ సినిమా కోసమే... చిరు ఆపరేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి కి ఆపరేషన్ అంటూ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అది మీడియాలో వచ్చిన రూమర్ అని చాలా మంది కొట్టిపారేసారు. అయితే అది నిజమే అని తేలింది. అయితే అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... కొన్నాళ్లుగా భుజం నొప్పితో బాధపడుతున్న చిరంజీవి ఇటీవల డాక్టర్స్ ని కలిసారు. వాళ్లు చిన్నపాటి ఆపరేషన్ తో సెట్ అవుతుందని సూచించారట. దీంతో చికిత్స కోసం ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చేరారు.

Chiraneevi to undergo surgery today

తన 150 వ చిత్రంగా 'కత్తి' రీమేక్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న నేపథ్యంలో.. సినిమా ప్రారంభమయ్యాక తన కారణంగా షూటింగ్‌కు అంతరాయం ఏర్పడకూడదని భావించిన చిరు.. ముందుగానే ఈ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

చిరంజీవికి చికిత్స ఇప్పటికే పూర్తయినప్పటికీ.. డాక్టర్స్ బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించడంతో మరి కొద్దిరోజులు అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. చిరంజీవి ఆస్పత్రిలో చేరారనే వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్స్.

English summary
Megastar Chiranjeevi is admitted at the Breach Candy Hospital and he will be undergoing a minor surgery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu