»   » అదీ చిరు స్టామినా.... ట్రెండింగ్ లో రచ్చ రచ్చ

అదీ చిరు స్టామినా.... ట్రెండింగ్ లో రచ్చ రచ్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొత్తానికి చిరంజీవి 150వ చిత్రం పూరి జగన్నాథ్‌తోనే అనే వార్త ఫిల్మ్‌నగర్‌ దాటి, మీడియాలో ప్రముఖంగా వచ్చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం గురించి రామ్‌చరణ్‌ తొలిసారి స్పందించటం తో అంతటా హాట్ టాపిక్ గా మారింది. జాంచో ఒక్కసారిగా అభిమానుల మధ్య ఈ చిత్రం గురించి చర్చలు మొదలయ్యాయి. దాంతో 'Chiru150' అంటూ హేష్ ట్యాగ్ లు దేశం అంతటా మొదలయ్యాయి. దాంతో ట్రెండింగ్ లో ఐదవ ప్లేస్ లో వచ్చింది.ఒక టైమ్ లో సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. హైదరాబాద్ ట్రెండ్ లలో పస్ట్ ఫ్లేస్ లోకి వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ''ఔను.. నిజమే. డాడీ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా'' అంటూ ఫేస్‌బుక్‌లో ఓ సందేశాన్ని ఉంచారు చరణ్‌. ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. చరణ్‌ని హీరోగా వెండితెరకు పరిచయం చేసింది పూరినే. ఇప్పుడు చరణ్‌ పూరి చిత్రంతోనే నిర్మాతగా మారుతున్నారు.

Chiranjeevi 150 is trending across nation

మరో వైపు పూరి జగన్నాథ్‌ కూడా చిరు 150వ సినిమాపై స్పందించారు. ''ఒకప్పుడు చిరంజీవి సినిమాకి థియేటర్ల దగ్గర డెకరేషన్లు చేసేవాడికేం తెలుసు? ఏదో ఒకరోజు వాడే ఆయన 150వ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని? దయచేసి అతన్ని దీవించండి'' అంటూ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం 'జ్యోతిలక్ష్మీ'కి సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు పూరి. ఆ తరవాత చిరు చిత్రంపై దృష్టిసారిస్తారు. అన్ని మేజర్ సిటీల్లోనూ ...టాప్ టెన్ లో ఈ విషయం ట్రెండింగ్ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

చిరంజీవి 150వ చిత్రం ఖరారైంది. కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా గురించి వార్తలు రావడం, ఇప్పటివరకూ అవి వాస్తవ రూపం ధరించకపోవడం తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా రామ్‌చరణ్‌ ఈ సినిమా విషయాన్ని ధృవీకరించంటం అభిమానుల్లో చెప్పలేని ఆనందం కలిగించింది. నిజానికి కొద్ది రోజుల క్రితమే బండ్ల గణేశ్‌ ఈ విషయాన్ని పరోక్షంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పూరి కూడా తన ఉద్వేగాన్ని బయటపెట్టకుండా ఉండలేకపోయారు.

Chiranjeevi 150 is trending across nation

ఇక ఈ చిత్రానికి కథను అందిస్తున్న బీవీఎస్‌ రవి ‘‘మెగాస్టార్‌ నుంచి అంగీకారం పొందడం ఎంతో ఉత్తేజంగా, ఉద్వేగంగా ఉంది'' అని తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ చిరంజీవి జన్మదినమైన ఆగస్ట్‌ 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆ రోజు ఆయన షష్ఠి పూర్తి కావడం కూడా విశేషం.

చిరంజీవి హీరోగా నటించిన చివరి సినిమా ‘శంకర్‌దాదా జిందాబాద్‌' 2007 జూలైలో విడుదలైంది. అంటే అది వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి హీరోగా ఆయన కెమెరా ముందుకు రాబోతున్నారన్న మాట.

English summary
Chiru’s 150 th movie turned hot debate among fans and hashtag, 'Chiru150' is trending across India. The hash tag also finds a place in top ten in all other major cities of India.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu