»   » చిరంజీవి 150వ సినిమా ప్రారంబోత్సవ (వీడియో)

చిరంజీవి 150వ సినిమా ప్రారంబోత్సవ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు కూడా నిన్న పాఠకులకు అందించాం. తాజాగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కూడా రిలీజైంది.

ఏప్రిల్ 29 మధ్యాహ్నం గం.1.30ని.లకు పూజా కార్యక్రమాలతో చిరంజీవి 150వ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. చిరంజీవి కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తుండటం మరో విశేషం. ఇందుకోసం రామ్ చరణ్ 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' అనే సినీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు.

గతంలో చిరంజీవికి ఠాగూర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం శుభ ముహూర్తాన సినిమా ప్రారంభం కాగా...ముహూర్తపు సన్నివేశానికి పరచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టారు. నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్విచ్ ఆన్ చేసారు.

సౌత్ లో టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చిరంజీవిని తన కెమెరా ద్వారా మరింత స్టైలిష్ గా చూపించబోతున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించనున్నారు. చిరంజీవి గత చిత్రాలు శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు దేవిశ్రీ విజయవంతమైన సంగీతం అందించారు.

English summary
‎Chiranjeevi 150th film Launch‬ Video. Megastar Chiranjeevi’s 150th project, an official remake of Tamil blockbuster Kaththi, was launched on Friday in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu