»   » మెగా ఫ్యామిలీ సమక్షంలో చిరంజీవి 150వ సినిమా ప్రారంభం (ఫోటోస్)

మెగా ఫ్యామిలీ సమక్షంలో చిరంజీవి 150వ సినిమా ప్రారంభం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం అభిమానులు రెండు మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ఘ నిరీక్షణ అనంతరం చిరంజీవి 150వ చిత్రం శుక్రవారం మధ్నాహ్నం 1.30 గంటలకు గ్రాండ్ గా మొదలైంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా రామ్ చరణ్, సురేఖ కలిసి తమ కొత్త ప్రొడక్షన్ కంపెనీ 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ ప్రారంభించారు.

అనంతరం చిరంజీవిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేసారు. నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు.

 ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం స్ర్కిప్ట్ కు వినాయ‌క్ గురువారం తూర్పుగోదావ‌రి జిల్లా అంత‌ర్వేది శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.

వినాయ‌క్ మీడియాతో మాట్లాడుతూ...మెగా ఫ్యామిలీలోని హీరోల‌తో ఎన్ని చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా..కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న మొద‌టి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. జూన్ మొద‌టివారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయ‌నున్నాం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి ప్రస్తుతం 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఇదే ఖరారు చేస్తారా? లేక మరేదైనా టైటిల్ ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది. సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ముహూర్తాలు లేనందున ప్రీ ప్రొడక్షనులు పూర్తి కాకుండానే సినిమా ప్రారంభోత్సవం జరిపారు.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో దేవిశ్రీ చిరంజీవి నటించిన శంకరద్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు విజయవంతమైన సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అతడే కాబట్టి ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం మళ్లీ దేవిశ్రీకే దక్కింది.

నిర్మాతగా చరణ్

నిర్మాతగా చరణ్

ఈ చిత్రాన్ని దెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 మెగా ఫ్యామిలీ సమక్షంలో చిరంజీవి 150వ సినిమా ప్రారంభం

మెగా ఫ్యామిలీ సమక్షంలో చిరంజీవి 150వ సినిమా ప్రారంభం

ఈ చిత్రం స్ర్కిప్ట్ కు వినాయ‌క్ గురువారం తూర్పుగోదావ‌రి జిల్లా అంత‌ర్వేది శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.

మెగా ఫ్యామిలీ సమక్షంలో చిరంజీవి 150వ సినిమా ప్రారంభం

మెగా ఫ్యామిలీ సమక్షంలో చిరంజీవి 150వ సినిమా ప్రారంభం

వినాయ‌క్ మీడియాతో మాట్లాడుతూ...మెగా ఫ్యామిలీలోని హీరోల‌తో ఎన్ని చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా..కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న మొద‌టి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను.

మెగా ఫ్యామిలీ సమక్షంలో చిరంజీవి 150వ సినిమా ప్రారంభం

మెగా ఫ్యామిలీ సమక్షంలో చిరంజీవి 150వ సినిమా ప్రారంభం

జూన్ మొద‌టివారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయ‌నున్నాం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామని వినాయక్ తెలిపారు.

మెగా ఫ్యామిలీ మొత్తం...

మెగా ఫ్యామిలీ మొత్తం...

చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వారికి వరకు మెగా ఫ్యామిలీకి చెందిన వారంతా ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు.

English summary
Mega stars Chiranjeevi 150 Launch‬ed today. which has been referred to as "Chiru 150," is tentatively titled, "Kaththilantodu."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu