»   » చిరంజీవి 151, 152 కూడా: లైన్లోకి బోయపాటి, త్రివిక్రమ్!

చిరంజీవి 151, 152 కూడా: లైన్లోకి బోయపాటి, త్రివిక్రమ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి అభిమానులకు ఇది శుభ వార్త లాంటిదే! ప్రస్తుతం ఆయన వివి వినాయక్ దర్శకత్వంలో 150వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈ సినిమానే చిరంజీవి చివరి సినిమా అని భావిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, తన ఒంట్లో సత్తా ఉన్నంత వరకు చిరంజీవి సినిమాల్లో కంటిన్యూ అవుతారని తెలుస్తోంది.

పవన్ దూరం: మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కో బాధ్యత...(పూర్తి డీటేల్స్)

తాజాగా అందుతున్న సమాచారం....ఓ వైపు 150వ సినిమా షూటింగులో బిజీగా ఉంటూనే చిరంజీవి తన 151, 152వ సినిమా ప్రాజెక్టులను కూడా ఓకే చేసే పనిలో ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయనకు 2019 ఎన్నికల వరకు ఎలాంటి పొలిటికల్ ప్రెజర్స్ ఉండే అకాశం లేదు. అందుకే ఈ లోగా వీలైనన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

చిరంజీవి చిన్న కూతురు కూడా....సినిమా రంగంలోకి!

చిరంజీవి 151వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం బోయపాటి శ్రీను దక్కించుకున్నట్లు సమాచారం. ఇటీవల బన్నీతో 'సరైనోడు' సినిమా తీసిన ఆయన స్టైల్ నచ్చడంతో, గతంలో సింహా, లెజెండ్ లాంటి భారీ విజయాలు నమోదు చేసిన ఘనత ఉండటంతో మెగాస్టార్ ఆయనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన బోయపాటి....చిరంజీవి తనదైన స్టల్ లో చూపించి మరో భారీ విజయం నమోదు చేస్తాడని అటు అభిమానులు కూడా నమ్మకంగా ఉన్నారు.

స్లైడ్ షోలో మరిన్ని చిరంజీవి 152వ సినిమాకు సంబంధించిన వివరాలు...

బోయపాటి ప్రస్తుతం అదే పనిలో.

బోయపాటి ప్రస్తుతం అదే పనిలో.

చిరంజీవి ఇటీవల బోయపాటిని పిలిచి కథను రెడీ చేయమని, దాన్ని 151వ సినిమా చేద్దామని సూచించినట్లు తెలుస్తోంది.

152వ సినిమా...

152వ సినిమా...

ప్రస్తుతం వినాయక్ తో చేస్తున్నది కమర్షియల్ సినిమా. తర్వత బోయపాటితో మాస్ సినిమా. దీని తర్వాత 152వ సినిమాగా మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ చేయాలని చిరంజీవి భావిస్తున్నారు.

 త్రివిక్రమ్ తో చేయాలని...

త్రివిక్రమ్ తో చేయాలని...

152వ సినిమాగా చేయబోయే ఫ్యామిలీ ఎంటర్టెనర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే బావుంటుందని చిరంజీవి భావిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కత్తిలాంటోడు

కత్తిలాంటోడు

తమిళంలో హిట్టయిన కత్తి సినిమాను ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమా 2017 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Till the 2019, Chiranjeevi will be more active in cinema field. He has already finalized scripts for his 151 and 152nd movies too. Chiranjeevi is now remaking Tamil “Kaththi” for his 150thmovie in the direction of V V Vinayak.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu