»   » చిరంజీవి 151, 152.... సినిమాలు ఎవరితో చేస్తున్నారో తెలుసా?

చిరంజీవి 151, 152.... సినిమాలు ఎవరితో చేస్తున్నారో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150' మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వి.వి.వినాయ‌క్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని స్వయంగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తుండటం, చిరు కూతురు సుష్మిత.... ఈ సినిమాకు డిజైనర్ గా పని చేస్తూ చిరంజీవిని సరికొత్త లుక్ లో ప్రజెంట్ చేయబోతున్నారు.

ఈ సినిమా సంగతి పక్కన పెడితే... చిరంజీవి తర్వాత చేయబోయే 151, 152 సినిమాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయట.

గీతా ఆర్ట్స్ బేనర్లో 151 మూవీ

గీతా ఆర్ట్స్ బేనర్లో 151 మూవీ

చిరంజీవి చేయబోయే 151వ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉండబోతోందని, ఈ సినిమాను స్వయంగా చిరు బావమరిది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బేనర్లో నిర్మించబోతున్నారని టాక్. మాస్ ఎంటర్టెనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

152వ మూవీ

152వ మూవీ

చిరంజీవి 150 సినిమా వాస్తవానికి పూరితో చేయాల్సింది. ‘ఆటో జానీ' పేరుతో కథ కూడా ఓకే అయి... అపీషియల్ అనౌన్స్‌మెంట్ చేసారు కానీ ఎందుకో కథ సెకండాఫ్ విషయంలో చిరంజీవి అసంతృప్తిగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయి వివి వినాయక్ చేతికి వెళ్లింది. ల్యాండ్ మార్క్ మూవీ కాబట్టి కొత్త కథతో రిస్క్ చేసే బదులు తమిళంలో హిట్టయిన కత్తి చిత్రాన్ని తెలుగులో ‘ఖైదీ నెం 150'గా రీమేక్ చేస్తున్నారు. అయితే పూరి చెప్పి ‘ఆటో జానీ' కథలో మార్పులు చేసి 152వ సినిమాగా ప్లాన్ చేస్తున్నారట.

చిరంజీవి 500 కోట్లు ఇన్విస్టమెంట్ గురించే అంతటా రచ్చ

చిరంజీవి 500 కోట్లు ఇన్విస్టమెంట్ గురించే అంతటా రచ్చ

చిరంజీవి 500 కోట్లు ఇన్విస్టమెంట్ గురించే అంతటా రచ్చ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవి-పవన్ కళ్యాణ్ దత్తన్న కూతురు పెళ్లి వేడుకలో

చిరంజీవి-పవన్ కళ్యాణ్ దత్తన్న కూతురు పెళ్లి వేడుకలో

చిరంజీవి-పవన్ కళ్యాణ్ దత్తన్న కూతురు పెళ్లి వేడుకలో (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

కేక పెట్టిస్తున్నావ్ బాసూ...

కేక పెట్టిస్తున్నావ్ బాసూ...

కేక పెట్టిస్తున్నావ్ బాసూ... (చిరు 150 యూరఫ్ వర్కింగ్ స్టిల్స్ కోసం క్లిక్ చేయండి)

English summary
Film Nagar source said that, Chiranjeevi 151st film Confirmed with Boyapati Srinu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu