చిరంజీవి 152: మొత్తానికి మొదలైంది.. ఇక టార్గెట్ అదే!

మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 152వ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం రోజు ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇకపై శరవేగంగా షూటింగ్ జరుపుకోనుంది.

హైదరాబాద్ నగరంలోని కోకాపేట‌లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ మొదలు పెట్టారు మేకర్స్. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి నిరంజ‌న్‌రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి సరికొత్తగా మేకోవర్ అయ్యారు. బాగా బరువు తగ్గి యంగ్ లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో చిరు ఇప్పటివరకు కనిపించని పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

 Chiranjeevi 152 Regular Shoot started

దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారట కొరటాల. నేటి సమాజంలో దేవాలయాల ప్రాముఖ్యత తెలియజేస్తూ, ఆ దేవాలయాల్లో జరిగే అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతూ కథను నడిపించనున్నారట. ఇక ఈ చిత్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి నటిస్తున్నారు. ఆయన సరసన త్రిష నటించనుందని టాక్ నడుస్తోంది.

త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేసేలా టార్గెట్ పెట్టుకున్నారట ద‌ర్శ‌క నిర్మాత‌లు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి 'గోవిందా హరి గోవిందా' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. అతి త్వరలో టైటిల్ విషయమై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X