For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో మెగా ప్రాజెక్ట్ ప్రారంభం.. మళ్లీ రికార్డులు తిరగరాసేందుకు రెడీ.. చిరు, కొరటాల మూవీ ప్రారంభం

|

సామాజిక సందేశ చిత్రాలను మాస్ ప్రేక్షకులు సైతం మెచ్చేలా తీయడంతో కొరటాల శివను మించినవారు లేరు. మొదటి సినిమా నుంచి తన స్టైల్లో సినిమాలను తెరకెక్కిస్తూ.. ఇంతవరకు అపజయమన్నది ఎరగకుండా దూసుకుపోతున్నాడు. తీసిని ప్రతీ సినిమా ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తోంది.

సైరా కలెక్షన్ల హోరు.. చిరంజీవి కెరీర్‌లో అరుదైన రికార్డు.. 200 కోట్లకు చేరువగా

 మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారెజ్, భరత్ అనే నేను..

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారెజ్, భరత్ అనే నేను..

హీరోలను అంతకుముందు కంటే స్టైలీష్గా, పవర్ ఫుల్గా, చూపించడంలో కొరటాల శివ దిట్టా. మిర్చితో ప్రభాస్ మరోరేంజ్ కు వెళ్లిపోయాడు. శ్రీమంతుడు సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి.. మళ్లీ ఫామ్లోకి వచ్చాడు మహేష్ బాబు. జనతా గ్యారెజ్ తో ఎన్టీఆర్ ను పూర్తిగా మార్చేసి.. నటనలోనూ పరిణితి చూపించేలా చేశాడు. ఇలా ప్రతీ స్టార్ కు మళ్లీ ఓ రేంజ్ మార్కెట్ ను తీసుకొచ్చేలా చేసే కొరటాల శివ.. మహేష్ బాబును రెండోసారి డైరెక్ట్ చేసి భరత్అనే నేనుతో ఇండస్ట్రీ హిట్ సినిమాను తీశాడు.

ప్రస్తుతం మెగాస్టార్ తో..

ప్రస్తుతం మెగాస్టార్ తో..

భరత్ అనే నేను చిత్రం తరువాత కొరటాల చెప్పిన కథకు చిరు ఓకే చెప్పడం.. అప్పటి నుంచి ఆ కథను చెక్కడంలో బిజీ అయ్యాడు కొరటాల. అయితే సైరా సినిమా ఆలస్యం అవుతుండటంతో ఈ మూవీ పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టింది. అయితే విజయ దశమి సందర్భంగా ఈ మూవీని అధికారికంగా ప్రారంభించారు.

మంచి ముహుర్తంలో ప్రారంభం..

విజయ దశమి రోజున చిరు, కొరటాల మూవీని చిత్ర నిర్మాతలు ప్రారంభించారు. కొణిదెల ప్రాడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జనతా గ్యారెజ్, భరత్ అనే నేను సినిమాకు సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన తిరు ఈ సినిమాకూ పనిచేస్తున్నాడు. వీరందరి సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి.

సైరా జోష్లో ఉన్న మెగాస్టార్..

సైరా చిత్రం అద్భుతమైన విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో మునిగి తేలుతున్నాడు. దసరా సెలవలుండటంతో కలెక్షన్లో సైరా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు ఆకాశన్నంటాయి. ఇదే జోష్లో చిరు తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేశాడు. ఈ కార్యక్రమానికి అంజనా దేవీ, సురేఖ, సుష్మిత హాజరయ్యారు. ఇంకా నిర్మాత డీవీవీ దానయ్య, రామజోగయ్య శాస్త్రిలాంటి వారు కూడా విచ్చేశారు. ఈ చిత్రానికి సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తుండగా.. ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ తీసుకున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు.

English summary
Chiranjeevi Started His 152 Film. In The Direction Of koratala Siva. Pooja Ceremony And formally Launched On Vijaya Dashami. Konidela Production ANd Matinee Entertainments Are Producing This Movie.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more