»   » శ్రీను వైట్ల ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే రీ ఎంట్రీ సాధ్యమైంది.. చిరంజీవి

శ్రీను వైట్ల ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే రీ ఎంట్రీ సాధ్యమైంది.. చిరంజీవి

Written By:
Subscribe to Filmibeat Telugu

మిస్టర్ ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున హృదయపూర్వక నమస్కారం. వరుణ్‌కు ఎప్పుడూ చెప్తుంటాను. నీ వెనుక మేమందరం ఉన్నాం. నీ వెనుక అభిమానులున్నారు. కష్టాన్ని నమ్ముకో మద్దతు ఇవ్వడానికి అభిమానులు రెడీగా ఉన్నారు.

Chiranjeevi

వచ్చిన అవకాశాలను ఒప్పేసుకోకుండా సినిమాలు ఎంపిక చేసుకోమని సలహా, సూచనలు ఇస్తుంటాను అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన మిస్టర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు.

శ్రీను వైట్ల చక్కటి టైమింగ్ దర్శకుడు

శ్రీను వైట్ల చక్కటి టైమింగ్ దర్శకుడు

శ్రీను వైట్ల చక్కటి కామేడి టైమింగ్ దర్శకుడు. అందరివాడు చిత్రం సమయంలో మా మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. శ్రీను మాస్ డైరెక్టర్. హీరోలకు స్టార్ స్టేట్ కల్పించే గొప్ప డైరెక్టర్. ఈ సినిమాలో కూడా తన సత్తాను చాటుకోవడానికి శ్రీను వైట్ల ప్రయత్నించాడు అని చిరంజీవి చెప్పారు

బ్రూస్‌లీ చిత్రంలో అతిధి పాత్రలో

బ్రూస్‌లీ చిత్రంలో అతిధి పాత్రలో

బ్రూస్‌లీ చిత్రంలో అతిధి పాత్రలో నటించాలని శ్రీను వైట్ల పట్టుబట్టి నాతో ప్రత్యేకంగా ఆ పాత్రను చేయించారు. చరణ్ సినిమాలో ఆ పాత్ర చేయడం ద్వారా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ సినిమా ద్వారా మళ్లీ నటించవచ్చనే భరోసాను కల్పించిన శ్రీను వైట్లకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు.

వరుణ్ తేజ్ నాకు ఈ మధ్య

వరుణ్ తేజ్ నాకు ఈ మధ్య

వరుణ్ తేజ్ నాకు ఈ మధ్య కొన్ని సన్నివేశాలు చూపించారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఈ వేడుకలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిక్కి జే మేయర్. క్లాస్ ట్యూన్ ఇచ్చే మిక్కి ఈ సినిమాలో మాస్ బీట్స్ ఇవ్వడం సంతోషం. మిక్కి జే మేయర్ బెస్టాఫ్ లక్. రచయిత గోపి మోహన్, శ్రీధర్ సీపానకు ధన్యవాదాలు అని చిరంజీవి ప్రసంగించారు.

లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ అందచందాలు

లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ అందచందాలు

లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ అందచందాలు ఈ చిత్రంలో చక్కగా ఉన్నాయి. వారి గ్లామర్ ఈ సినిమాకు ఉపయోగపడుతుంది. వరణ్ నటించిన కంచె సినిమా నాకు బాగా నచ్చిన చిత్రం. వరుణ్ లోఫర్ చిత్రం మాస్ చిత్రం కూడా నచ్చింది. కామేడి టచ్‌తో ఉన్న మిస్టర్ చిత్రం విజయవంతం కావాలని కోరుకొంటున్నాను అని వరుణ్ తేజ్‌ను చిరంజీవి ఆశీర్వదించారు.

English summary
Mega star Chiranjeevi attended as Chief guest for Mister Movie pre release function. Megastar praised Director Srinu Vaitla, actor Varun Tej, Mikki J Mayor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu