For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  టైటిల్ నాదే, శిరీష్ హీరో అవుతాడనుకోలే, అరవింద్ నా అదృష్ణం: చిరంజీవి (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లుశిరీష్‌, లావణ్యత్రిపాఠి హీరో హీరోయిన్లుగా పరుశురాం దర్శకత్వంలో అల్లు అరవింద్‌ నిర్మాతగా రూపొందించిన చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. ఈ సినిమా ఆగస్టు 5న విడుదలవుతుంది.

  తన కొడుకు శిరీస్ కు ఈ సినిమా బ్రేక్ ఇచ్చే సినిమాగా భావిస్తున్న నిర్మాత అరవింద్.... సినిమాకు పబ్లిసిటీ పెంచడంలో భాగంగా చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలిచి ప్రీ రిలీజ్ పంక్షన్ పేరుతో వేడు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చిరుతో పాటు బోయపాటి శ్రీను ఇంకా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

  ఈ సంరద్భంగా చిగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ '' నేను, సరిత కలిసి గతంలో కట్టా సుబ్బారావుగారి దర్శకత్వంలో 'శ్రీరస్తు శుభమస్తు' అనే సినిమా చేసాం. అప్పట్లో ఆ సినిమా బాగా ఆడింది. తిరిగి అదేఆ టైటిల్‌ ఇపుడు వినగానే వెంటనే కనెక్ట్‌ అయ్యాను. నాకు అత్యధిక సినిమాలు ఇచ్చిన సినిమాలు, విజయవంతమైన సినిమాలు ఇచ్చిన సంస్థ గీతాఆర్ట్స్‌. చక్కటి అభిరుచి గల అరవింద్‌లాంటి నిర్మాత దొరకడం కూడా నా అదృష్టం. సినిమాల పరంగా అరవింద్‌గారు ఎప్పుడూ అప్‌డేట్‌ అవుతుంటారు. ఇప్పుడు గీతాఆర్ట్స్‌ సంస్థ నెంబర్‌వన్‌గా ఉందంటే కారణం ఆయన అభిరుచే కారణం. నిర్మాతగా పెద్ద చిన్న సినిమాలు చేస్తూ విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఆయన అభిరుచికి తగినట్టు రూపొందిన ఈ సినిమా కచ్చితంగా మరో సక్సెస్‌ను సాధిస్తుంది అన్నారు.

  చిరంజీవి మాట్లాడిని మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో...

  శిరీష్ హీరో అనుకోలేదు

  శిరీష్ హీరో అనుకోలేదు


  శిరీష్‌ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. శిరీష్‌ ఆలోచనా విధానంకానీ, నడవడిక కానీ చూసి తను సినిమా హీరో అవుతాడనుకోలేదు. తను ఒక మంచి ప్రొడ్యూసర్‌ అవుతాడనిపించింది. కానీ తను ఆర్టిస్ట్‌ అయ్యాడు అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

  కష్టపడే వ్యక్తి

  కష్టపడే వ్యక్తి


  శిరీష్ లో కష్టపడే తత్వం కూడా ఎక్కువే. ఏదో సినిమా చేసేయాలని కాకుండా విలక్షణంగా, ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించేవాడు. తన ప్రయతానికి నేను తనను అభినందిస్తున్నాను. ఈ సినిమాతో తన భవిష్యత్‌కు మంచి పునాది వేసుకుంటాడు అన్నారు చిరంజీవి.

  సినిమా గురించి..

  సినిమా గురించి..


  ఈ సినిమా ఫస్ట్‌కాపీని ఈరోజు చూశాను. దర్శకుడు పరుశురాం సినిమాను ఎక్కడా డ్రాప్‌ కాకుండా సున్నితంగా హ్యండిల్‌ చేశాడు. అభ్యంతరాలు చెప్పే ఫాదర్‌కి, అభ్యుదయ భావాలున్న బిడ్డలకు మధ్య జరిగే సంఘర్షణ. దీన్ని చాలా చక్కగా చూపించారు. సినిమా చూస్తుంటే సక్సెస్‌ఫుల్‌ సినిమా బొమ్మరిల్లు సినిమా గుర్తుకు వచ్చింది అన్నారు చిరంజీవి.

  లావణ్య గురించి

  లావణ్య గురించి


  లావణ్య గ్లామర్‌తో సినిమాకు మరింత అందాన్ని తెచ్చింది. వండర్‌ఫుల్‌గా నటించింది అని చిరంజీవి అభినందించారు.

  151వ సినిమా చేస్తే..

  151వ సినిమా చేస్తే..


  థమన్‌ మంచి మ్యూజిక్‌ అందించాడు. భవిష్యత్‌లో 151వ చిత్రం చేస్తే, ట్యూన్స్‌ బావుంటే తన మ్యూజిక్‌లో సినిమా చేయడానికి నేను రెడీ అని చిరంజీవి అన్నారు.

   టైటిల్ నాదే, శిరీస్ హీరో అవుతాడనుకోలే, అరవింద్ నా అదృష్ణం: చిరంజీవి (ఫోటోస్)

  టైటిల్ నాదే, శిరీస్ హీరో అవుతాడనుకోలే, అరవింద్ నా అదృష్ణం: చిరంజీవి (ఫోటోస్)

  అల్లు శిరీష్‌ మాట్లాడుతూ 'టీం అందరూ బెస్ట్‌ సినిమా ఇవ్వాలనే కష్టపడి సినిమా చేశాం. నిజాయితీగా చెప్పాలనుకున్నది చెప్పాం. ఏ ఇంట్లో ఆడవాళ్ళు గౌరవింపబడతారో, ఆ ఇంట్లో దేవతలు కొలువు తీరుతారు అనేదే సినిమా పాయింట్‌. దీన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిపి చేశాం అని శిరీష్ తెలిపారు.

  చిరంజీవి గురించి..

  చిరంజీవి గురించి..


  చిరంజీవిగారి గురించి చెప్పాలంటే ఆయన నాకు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు రోల్‌ మోడల్‌. నాకు ఒక భాధ్యతను క్రియేట్‌ చేశారు..నేను ఇంటర్‌ చదివేటప్పుడు లావుగా ఉండేవాడిని అప్పుడు నాన్నగారు కూడా శిరీష్‌ ఏమౌతాడోనని అనుకుంటుంటే మావయ్యే ఒక సంవత్సరం పాటు వాళ్ళ ఇంట్లో ఉంచుకుని నేనేం తింటున్నానో కూడా దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు నా అన్నయ్య పిల్లల్ని చూస్తున్నప్పుడు నేను కూడా అలాగే బాధ్యతగా ఉండాలని నేర్చుకున్నాను అన్నారు శిరీష్.

  దర్శకుడు

  దర్శకుడు


  చిత్ర దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ ''నన్ను నమ్మి, అరవింద్‌గారికి చెప్పి నాకు సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ముందు శిరీష్‌కు థాంక్స్‌. ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒక మాట చెప్పారు. బంగారంలాంటి నా కొడుకును నీ చేతిలో పెడుతున్నాను...నువ్వేం చేస్తావో అని అన్నారు. ఆయనకు నేను చెప్పేదొక్కటే సార్‌..మీ బంగారాన్ని ఓమంచి అభరణంగా మలిచి దాని విలువ పెంచి మీ చేతికిస్తున్నాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్‌ అన్నారు.

  బోయపాటి

  బోయపాటి


  బోయపాటి శ్రీను మాట్లాడుతూ ''శ్రీరస్తు శుభమస్తు చాలా శుభప్రదమైన పేరు. ఇంత మంచి పేరు పెట్టిన యూనిట్‌ను అభినందిస్తున్నాను. ఈ సినిమా కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ బ్యానర్‌లో నేను సరైనోడు అనే సినిమా చేశాను. అలాగే సినిమా కూడా అద్భుతమైన సినిమా అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

  ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ

  ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ


  ''నా కెరీర్‌లోనే ఫస్ట్‌ సాఫ్ట్‌ టైటిల్‌ ఇదే. పరుశురాంకు నేను నా లవ్‌స్టోరీస్‌ చెపుతుండేవాడిని నీతో తప్పకుండా ఓ లవ్‌స్టోరీ చేస్తానని ఆయన అనేవాడు. కానీ ఇంత త్వరగా కుదురుతుందని అనుకోలేదు. ఈ సినిమా తర్వాత శ్రీరస్తు శుభమస్తు థమన్‌ అంటారనుకుంటున్నా అన్నారు.

  నటీనటులు

  నటీనటులు


  అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర త‌దిత‌రులు న‌టిస్తున్నారు

  తెర వెనక

  తెర వెనక


  ఈ చిత్రానికి సంగీతం: తమన్.య‌స్‌.య‌స్‌, యాక్షన్ - రామ్, లక్ష్మణ్, ఆర్ట్ : రామాంజనేయులు, డిఓపి: మణి కంఠన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: నాగ‌రాజు, ఎడిటర్: మార్తాడ్ కె.వెంకటేష్, నిర్మాత: అల్లు అరవింద్, దర్శకుడు: పరశురామ్.

  English summary
  Allu Sirish, Lavanya Tripathi acted Srirastu Subhamastu pre- release Function held at JRC Convention Centre at Hyderabad on Sunday (31stAug) evening.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more