»   » చిరూ బాలయ్య ఫ్యాన్స్ వార్ ఇక్కడే మొదలవుతోంది.... ఎలా ఆపుతారో

చిరూ బాలయ్య ఫ్యాన్స్ వార్ ఇక్కడే మొదలవుతోంది.... ఎలా ఆపుతారో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సంక్రాంతికి ఇద్దరు అగ్ర హీరోలు నువ్వా-నేనా అన్నట్టుగా తలపడబోతున్నారు. 16 యేళ్లు తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు స్టార్లు ఢీకొనటం గమనార్హం. ఇదివరకు పోటీ పడ్డప్పటికీ ఇంత తీవ్రమైన పోటీ అనిపించలేదు కానీ, ఈ సంక్రాంతికి మాత్రం అంచనాలతో పాటు పోటీ కూడా తారా స్థాయిలో ఉంది. దీంతో ఇద్దురు అగ్రహీరోలతో పాటు వారివారి అభిమానులకు తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. ఇద్దరు టాప్ స్టార్స్ మూవీస్ ఒకేసారి రిలీజ్ కావడం చాలా అరుదు. నిజం చెప్పాలంటే ఒక బిగ్ స్టార్ సినిమా ఇంకో బిగ్ స్టార్ మూవీతో ఢీకొని చాలాకాలమే అయింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఒకేసారి విడుదలై విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసిన ఇన్సిడెంట్స్ గతంలో చాలానే ఉన్నాయి. పండగలకు వీరి సినిమాలు ప్రేక్షకులకు కన్నుల పండగే అయ్యేవి.

ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి 19వ సారి బాక్సాఫీస్ పోటీకి దిగబోతున్నారు. వచ్చే సంక్రాంతికి వీళ్లిద్దరి సినిమాలూ రాబోతున్నాయి. చిరంజీవి 150 సినిమా ...ఖైదీ నంబర్ 150 గా రిలీజ్ కి రెడీ అవుతుంటే, బాలకృష్ణ తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి గా సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. బాలకృష్ణ, చిరంజీవిలకి ఇవి ప్రతిష్టాత్మకమైన సినిమాలే కాబట్టి ఇద్దరి సినిమాల మధ్య పోటీ కూడా ఇంట్రెస్టింగ్ గా మరియు బలంగా ఉండొచ్చు అనే సందేహం అభిమానులలో కలుగుతోంది.

 Chiranjeevi and Balakrishna Fans War on Hoardings

ఖైదీ-శాతకర్ణిలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డానికి ఇంకా పది రోజులకు పైగా టైమ్ ఉంది కానీ.. ఫ్యాన్స్ ఇప్పుడు ప్రచారం దగ్గరే పోటీ పడ్డం మొదలుపెట్టేశారట. ప్రధానంగా హోర్డింగ్ ల ఏర్పాటు విషయంలో విపరీతమైన హంగామా నడుస్తోందని తెలుస్తోంది. ఆయా హోర్డింగ్ కంపెనీల యజమానులతో.. ప్రైమ్ స్పాట్ లో హోర్డింగ్ తమదే ఉండాలని పట్టు పడుతున్నాయట ఇరు వర్గాలు. ఎటు తేల్చుకోవాలో అర్ధంకాని పరిస్థితి పబ్లిసిటీ కంపెనీలకు ఏర్పడుతోంది. హైద్రాబాద్ తో పాటు ప్రధాన పట్టణాల్లోని అన్ని ఏరియాల్లోనూ ఇదే సిట్యుయేషన్ అంటున్నారు.

ఇటు పెద్ద హోర్డింగులే కాదు.. రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసి చిన్నపాటి పబ్లిసిటీ లాలీపాప్స్ విషయంలో కూడా ఈ కాంపిటీషన్ కనిపిస్తోంది. ఎంతగా అంటే.. బాలయ్య ఇంటికి సరౌండింగ్స్ లో ఉండే మొత్తం కేంపెయినింగ్ కాన్సెప్ట్స్ ను చిరు టీం బుక్ చేసేసుకున్నారట. అఫ్ కోర్స్.. ఇది కేవలం బాలయ్య ఇంటిని టార్గెట్ చేసే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఆ దగ్గర్లోనే ఖైదీ నంబర్ 150 నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఆఫీస్ కూడా ఉంటుంది. పోస్టర్లు.. హోర్డింగుల దగ్గరే ఇంత పోటీ ఉంటే.. ఇక సినిమా రిలీజ్ అయ్యే నాటికి ఏ రేంజ్ కి చేరుకుంటుందో!

English summary
According to sources, both the parties - Chiru & Balayya - are showing interest in the same hoarding spots in and around Hyderabad. Even in other major cities, towns, fan groups are involving in similar clash to bag the premier positions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu