»   » అర్ధరాత్రి కుదరదు: చిరు బర్త్‌డేపై పోలీసుల ఆంక్షలు?

అర్ధరాత్రి కుదరదు: చిరు బర్త్‌డేపై పోలీసుల ఆంక్షలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 22న 60వ వడిలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో అభిమానులు ఈ నెల 16 నుండే జన్మదినవారోత్సవాలు ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. వారోత్సవాల్లో చివరి రోజైన శనివారం(ఆగస్టు 21) హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో బర్త్ డే సెలబ్రేషన్స్ భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసారు. సరిగ్గా 21వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటల నుండి వేడుక నిర్వహించి సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు చిరంజీవితో కేక్ కట్ చేయించి, ఆయన స్పీచ్ తో సెలబ్రేషన్స్ ముగించాలని ముందుగా ప్లాన్ చేయించారు.

అయితే భద్రత కారణాల దృష్ట్యా అర్థరాత్రి వరకు వేడుకలు నిర్వహించడంపై పోలీసులు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా అనుకున్న సమయం కంటే రెండు గంటల ముందుగానే 1.45 గంటలకు వేడుకలు ప్రారంభించి రాత్రి 10.30 గంటలలోపే చిరంజీవితో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు ముగించాలని ప్లాన్ చేస్తున్నారు.

Chiranjeevi birthday celebrations details

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ వేడుకలకు పలువురు సినీ స్టార్లు, పొలిటీషియన్స్ హాజరు కాబోతున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు రామ్ చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అభిమానులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే వేదికగా చిరంజీవి 150వ సినిమా ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.

వేడుకల్లో భాగంగా పలువురు డాన్సర్లు చిరంజీవి సినిమాల్లోని పాటకు డాన్స్ కార్యక్రమాలు, మిమిక్రి కళాకారుల కార్యక్రమాలు, జబర్దస్త్ టీం కామెడీ షో, బ్రహ్మానందం కామెడీ కార్యక్రమాలతో పాటు.... సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న అభిమానులకు అవార్డుల ప్రధానం లాంటివి జరుగనున్నట్లు సమాచారం.

English summary
Megastar Chiranjeevi birthday celebrations will be on 21st in hyderabad. it will be Massive. It will be from 1:45pm to 10:35pm. All mega hero's and few ministers will participate!!
Please Wait while comments are loading...