»   » హాట్ షాట్: ఛార్మిని ముద్దెట్టేసిన త్రిష (ఫొటో)

హాట్ షాట్: ఛార్మిని ముద్దెట్టేసిన త్రిష (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అంత ముద్దు వచ్చేసిందో ఏమో కానీ ఛార్మిని గట్టిగా ముద్దెసుకుంది త్రిష. ఈ క్రింద మీరు చూస్తున్న ఫొటో ...చిరంజీవి బర్తడే వేడుకలో చోటు చేసుకున్నది. ఈ ఫొటో ఇప్పుడు త్రిష,ఛార్మి అబిమానుల సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తిరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఈ పార్టిలో పాటలకు డాన్స్ వేసారు. అంతేకాకుండా చిరంజీవి,ఛార్మి కలిసి వానా వానా సాంగ్ కు డాన్స్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే ఛార్మి,త్రిష కలిసి పౌర్ణమి చిత్రంలో చేసారు. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో యావరేజ్ అనిపించుకుంది. అయితే అప్పటినుంచీ వీరి బంధం మాత్రం బలపడుతూ వచ్చింది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఛార్మిని కలవకుండా త్రిష వెళ్లదు. అలాగే చెన్నై వెళ్లినప్పుడు త్రిషని కలిసే ఛార్మి వస్తుంది. ఇలా వీరిద్దరూ స్నేహంగా కలుస్తూ,షాపింగ్ లు గట్రా చేస్తూంటారు.

Chiranjeevi Birthday: Trisha kissed Charmi

చిరు పుట్టిన రోజు విశేషాలకు వస్తే...

చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చిరు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకొన్న సమయంలో తోటి తారలంతా వచ్చి ఆయన్ని పరిశ్రమకి స్వాగతం పలికినట్టుగా మెగా సంబరం జరిగింది. చిరు పుట్టినరోజుని పురస్కరించుకొని ఓ హోటల్‌లో జరిగిన వేడుకకి వివిధ సినీ పరిశ్రమలకి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు.

అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో తారలంతా తళుక్కున మెరిశారు. వేడుకకి వచ్చే అతిథుల్ని ఆహ్వానించేందుకు చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ముందుగానే హోటల్‌కి చేరుకొన్నారు. రాత్రి 8 గంటలకు వేడుక మొదలైంది. తన మిత్రులతో కలసి పవన్‌ కల్యాణ్‌ స్వయంగా కారు నడుపుకొంటూ హోటల్‌కి చేరుకొన్నారు. నేరుగా చిరంజీవి దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు.

అంతకుముందే చిరంజీవి ఇంటికి వెళ్లి పవన్‌ శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన సల్మాన్‌ ఖాన్‌కు రామ్‌చరణ్‌ సాదరంగా స్వాగతం పలికాడు. ఈ వేడుకకి బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్‌, నాగార్జున, కమల్‌హాసన్‌, శత్రుఘ్నసిన్హా, అంబరీష్‌, శ్రీదేవి, బోనీ కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌, వివేక్‌ ఒబెరాయ్‌, కుష్బూ, సూర్య, కె.విశ్వనాథ్‌, కె.రాఘవేంద్రరావు, సుహాసిని, సుమలత, లిజి, రాధ, అల్లు అరవింద్‌ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

రాజకీయ ప్రముఖుల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్‌, గంటా శ్రీనివాసరావు, తెలంగాణ మంత్రి కె.తారకరామారావు తదితరులు హాజరయ్యారు.

English summary
Hugging Charmi from the back, Trisha has planted a kiss on Charmi's cheek. This happened at Megastar's 60th birthday bash.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu