»   » బ్రూస్ లీలో నా ఎంట్రీ కొసమెరుపు, 15 రోజుల్లో నా సినిమా వివరాలు: చిరంజీవి

బ్రూస్ లీలో నా ఎంట్రీ కొసమెరుపు, 15 రోజుల్లో నా సినిమా వివరాలు: చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్రూస్‌లీ సినిమాలో నటించేందుకు రామ్‌చరణ్ ఎంతో శ్రమించారని నటుడు చిరంజీవి కితాబిచ్చారు. శుక్రవారం బ్రూస్‌లీ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్రూస్‌లీలో తన పాత్ర గురించి అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారని అన్నారు. బ్రూస్‌లీ సినిమాలో తన ఎంట్రీ కొస మెరుపు లాంటిదని చిరంజీవి అన్నారు.

ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పాలంటే సంపూర్ణంగా భోజనం చేసిన తర్వాత ఒక స్వీటు తిన్నట్టు ఉంటుందన్నారు. తమకు ఇన్‌స్పిరేషన్ అభిమానులేనని చెప్పారు. సినిమా ఎలాగు రిలీజ్‌కు దగ్గరకు వచ్చింది కాబట్టి సినిమాలోని డైలాగ్ చెప్పడానికి వెనుకాడనని ఒక డైలాగ్ చెప్పారు.

బ్రూస్‌లీలో రామ్‌చరణ్ కొట్టిన బాస్ మీ స్టెమినోను, మీ స్పీచ్‌ను అందుకోలేను బాస్ అనే డైలాగ్‌ను చెప్పారు. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తన అందచందాలతో అలరించారని కితాబిచ్చారు. సినిమాకు ఒక రూపు వచ్చేలా నటించారని అన్నారు. రకుల్‌కు ప్రత్యేక అభినందలను తెలిపారు.

తన 150 సినిమా పూర్తి స్థాయిలో ఉంటుందని ఆయన చెప్పారు. తన సినిమా వివరాలను 15 రోజుల్లో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. తన 150 సినిమాను రామ్ చరణ్, సురేఖ నిర్మిస్తున్నట్లు తెలిపారు.

కాగా, రామ్ చరణ్, రుకల్ ప్రీత్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ తెరకెక్కింది. ఈ చిత్రానికి ఎన్ఎన్ ధమన్ స్వరాలు సమకూర్చారు. రామాజోగయ్య శాస్త్రి నాలుగు పాటలు రచించారు. దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన లే ఛలో అనే పాటను ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల మంది వీక్షించడం ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు ధమన్ అన్నారు.

ఆడియో విడుదల కార్యక్రమంలో నిర్మాత దానయ్యతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్సకుడు శ్రీను వైట్ల, రామ్ చరణ్ తేజ, రకుల్ ప్రీత్, కృతి కర్బంద, సాయి ధర్మ తేజ్, సంగీత దర్శకుడు ధమన్, పాటల రచయిత రాం జోగయ్య శాస్త్రి, ప్రముఖ కోన వెంకట్, వివి వినాయక్, రచయిత గోపి మోహన్ తదితరులు హాజరయ్యారు.

సీడీ ఆవిష్కరణ

సీడీ ఆవిష్కరణ


ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగా హీరో రాంచరణ్ నటించిన బ్రూస్‌లీ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

వివి వినాయక్ కు తొలి సీడీ

వివి వినాయక్ కు తొలి సీడీ


బ్రూస్‌లీ చిత్ర ఆడియోను మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. తొలి ఆడియో సీడీని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌కు అందజేశారు.

చిరంజీవి

చిరంజీవి


బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ ది డ్రాగన్' చిత్రంలో సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అలాంటి బ్రూస్ లీ పేరుతో ఈ సినిమా వస్తున్నందుకు రాంచరణ్ చాలా ధన్యుడనిపిస్తున్నదని చిరంజీవి అన్నారు. అన్నాచెల్లెల్ల సెంటిమెంట్ ఈ సినిమాలో వుందేమో అందుకే ఈ సినిమాకు బ్రూస్‌లీ అని పేరు పెట్టి వుంటారనిపిస్తున్నదని అన్నారు.

అతిథి పాత్రలో...

అతిథి పాత్రలో...

అతిథి పాత్రలో...

English summary
Mega star Chiranjeevi said taht his character in Bruce Lee is a kosa merupu.
Please Wait while comments are loading...