»   » అది కుదరకే... ఫ్యాన్స్ కోసం రూటుమార్చిన చిరంజీవి!

అది కుదరకే... ఫ్యాన్స్ కోసం రూటుమార్చిన చిరంజీవి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా చేస్తే చూడాలని అభిమానులు చాలా కాలంగా ఆశగా ఎదురు చూస్తున్నారు. సంవత్సరాల నిరీక్షణ తర్వాత పూరి దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ ప్రకటన రాగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. పూరి స్టోరీ నచ్చక పోవడంతో 150వ సినిమా రద్దయింది. మళ్లీ చిరంజీవి 150వ సినిమా వ్యవహారం మొదటికి వచ్చింది.

దీంతో అభిమానులు చాలా డిసప్పాయింటుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభిమానులను తాత్కాలికంగా ఆనంద పరచడానికి రూటు మార్చారు చిరంజీవి. త్వరలో రామ్ చరణ్ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో ఆయన అతిథి పాత్రలో నటిస్తారని అంటున్నారు. ఈచిత్రానికి ‘మెరుపు' అనే టైటిల్ ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు.

పుట్టినరోజున చిరంజీవి నుండి ప్రకటన వస్తుందన్న అభిమానుల ఆశలపై చిరంజీవి స్వయంగా ప్రకటన చేయడం ద్వారా నీళ్లు చల్లారు. ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఇతర స్క్రిప్టులను పరిశీలిస్తున్నాను. అంత సవ్యంగా సాగితే రెండు మూడు నెలల్లో షూటింగ్ మొదలు పెడతామన్నారు. తాను రామ్ ‘మెరుపు'లో గెస్ట్ రోల్ చేస్తున్నానంటూ అభిమానులకు కాస్త ఊరటకలిగించే ప్రయత్నం చేసారు.

రామ్ చరణ్ 9

రామ్ చరణ్ 9

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 9వ చిత్రం ‘మెరుపు'.

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ కూడా డిసప్పాయింటుగానే ఉన్నారు. ఎందుకంటే పూరి దర్శకత్వంలో నాన్న 150వ సినిమా చేస్తున్నాడని గతంలో ప్రకటించింది రామ్ చరణే.

రూమర్స్

రూమర్స్

పూరితో సినిమా రద్దయిన విషయం తేలి పోయింది. 150వ వినాయక్ తో ఉంటుందని భావిస్తున్నారు

మెరుపు

మెరుపు

చిరంజీవి గెస్ట్ రోల్ చేయడం ద్వారా మెరుపు చిత్రంపై అంచనాలు భారీగా ఉండబోతున్నాయి.

English summary
"I'm completely focusing on 150 for now and few scripts are in discussion. If things go well, i might start shooting in two three months", Chiranjeevi informed. He has also revealed that he will be doing a guest role in Ram Charan's Merupu, to the joy of mega fans.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu