For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తమన్నా క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన చిరంజీవి.. అందరూ అలా అనుకుంటారు కానీ!

|

మిల్క్ బ్యూటీ తమన్నాపై చిరంజీవి చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవలే విడుదలైన చిరంజీవి చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి, తెలుగు సినిమా స్థాయిని మరోసారి ఎలుగెత్తి చాటిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కళా బంధు టీ. సుబ్బిరామిరెడ్డి సైరా యూనిట్ పై అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ వేదికపై మాట్లాడిన చిరంజీవి.. తమన్నా క్యారెక్టర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. వివరాల్లోకి పోతే..

సైరాలో ఇద్దరు హీరోయిన్లు

సైరాలో ఇద్దరు హీరోయిన్లు

సైరా నరసింహా రెడ్డి చిత్రంలో హీరోయిన్లుగా నయనతార, తమన్నా ఇద్దరూ నటించారు. ఇద్దరి క్యారెక్టర్స్ దేనికవి ప్రత్యేకమైనవే అని చెప్పుకోవచ్చు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి భార్య సిద్దమ్మ పాత్రలో నయన్ నటించగా, నర్తకి లక్ష్మి పాత్రలో తమన్నా మెప్పించింది. ఉయ్యాలవాడ వీరుడికి సపోర్ట్ తమన్నా చూపిన అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది.

తమన్నాపై చిరు కామెంట్స్.. ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంది

తమన్నాపై చిరు కామెంట్స్.. ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంది

సైరా నరసింహా రెడ్డి సినిమాలో తమన్నా రోల్ గురించి మాట్లాడుతూ ఆమెను ఆకాశానికెత్తారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాలో తన తర్వాత అంత ఇంపాక్ట్ ఉన్న పాత్ర చేసింది తమన్నానే అని చెప్పారు. ఈ సినిమాలో నా కంటే, చరణ్ కంటే, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంది తమన్నానే అని చిరు అన్నారు.

తమన్నా క్యారెక్టర్ పవర్ అంతాఇంతా కాదు

తమన్నా క్యారెక్టర్ పవర్ అంతాఇంతా కాదు

సైరా నరసింహా రెడ్డి సినిమాలో తమన్నా పాత్ర నిడివిని పక్కన బెడితే ఆమె చేసిన ఆ క్యారెక్టర్ పవర్ అంతాఇంతా కాదని అన్నారు చిరంజీవి. నా సంగతి అటుంచితే నెక్స్ట్ అంత పేరొచ్చిన క్యారెక్టర్ తమన్నా అని చిరు చెప్పడంతో పక్కనే ఉన్న తమన్నా ఆనందంలో మునిగితేలింది.

ఈ యాంగిల్ కూడా తమన్నాతో ఉందా అనుకున్నా

ఈ యాంగిల్ కూడా తమన్నాతో ఉందా అనుకున్నా

ప్రతీ ఒక్కరికీ తమన్నా అనగానే మిల్క్ బ్యూటీ, గ్లామర్ డాల్, బ్యూటీ డాల్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఈ సైరాలో ఓ అద్భుతమైన క్యారెక్టర్ పోషించి శభాష్ అనిపించుకుంది తమన్నా అని చిరు చెప్పారు. అసలు తమన్నాతో ఈ యాంగిల్ కూడా తమన్నాతో ఉందా? అని అనిపించిందని చిరంజీవి చెప్పారు. తమన్నా మరచిపోలేని పాత్ర చేసిందని ఆయన తెలిపారు.

ప్రత్యేకించి ప్రమోషన్స్‌లో..

ప్రత్యేకించి ప్రమోషన్స్‌లో..

ప్రత్యేకించి ప్రమోషన్స్‌లో కూడా తమన్నా పాల్గొనడం చిత్రయూనిట్ అభినందించదగిన విషయమని, సైరా సినిమాను ఓన్ చేసుకుని ప్రతీ ప్రమోషనల్ వేడుకకు రావడం ఆనందంగా ఉందని అన్నారు చిరంజీవి. సైరా ప్రమోషన్స్ ఎక్కడ జరిగినా ఆమెనే ముందుండి అన్ని ఏరియాల్లో పర్యటించిందని చిరు అన్నారు.

నేటితరం హీరోయిన్లకు తమన్నా ఆదర్శం

నేటితరం హీరోయిన్లకు తమన్నా ఆదర్శం

ఓ సినిమా కోసం తమన్నా చూపిన ప్రొఫెషనలిజం, డెడికేషన్ అంతాఇంతా కాదని అంటూ తమన్నాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు చిరు. నేటితరం హీరోయిన్లకు తమన్నా ఒక ఆదర్శం. తమన్నా ఒక అద్భుతం అని చిరంజీవి అన్నారు. దీంతో తమన్నా ఆనాడు హద్దులేకుండా పోయాయి. వెంటనే చేతులు జోడించి నమస్కరించింది తమన్నా.

Funny Moment Between Ram Charan And Subbirami Reddy | JAI JAI RAA NARSIMHA REDDY Event
సినీ ప్రముఖులంతా కూడా..

సినీ ప్రముఖులంతా కూడా..

ఇక ఈ కార్యక్రమంలో వెంకటేశ్, జీవిత రాజశేఖర్ దంపతులు, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఛార్మి, నిహారిక, కేథరిన్, అశ్వినీదత్, బోనీకపూర్, సురేష్ బాబు, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, క్రిష్,సుకుమార్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, రాజకీయ నాయకులు రఘురామ కృష్ణంరాజు, మురళీమోహన్, కేవీపీ, పీవీపీ, సీఎం రమేష్, దానం నాగేందర్, జేసీ పవన్‌రెడ్డి, క్రీడారంగం నుంచి చాముండేశ్వరినాథ్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

English summary
T Subbirami Reddy is well known as 'Kalabandhu' for a reason. He takes pleasure in others' successes and showers artistes with unconditional love. Time and again, this veteran politician, producer and philanthropist has proved his love for good cinema. Delighted with the massive success of 'Sye Raa Narasimha Reddy', TSR felicitated the film's team at an event held at Park Hyatt in Hyderabad on Wednesday. In This event Chiranjeevi Commented Tamannaah's Charecter in Sye Raa.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more