»   » రావు రమేష్‌కు చిరంజీవి ఓదార్పు.. కుటుంబానికి మెగాస్టార్ పరామర్శ

రావు రమేష్‌కు చిరంజీవి ఓదార్పు.. కుటుంబానికి మెగాస్టార్ పరామర్శ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Actor Rao Ramesh Mother Passed Away

సుప్రసిద్ధ నటుడు, దివంగత రావు గోపాలరావు సతీమణి, నటుడు రావు రమేష్ తల్లి కమలకుమారి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. కమలకుమారి గొప్ప హరికథా కళాకారిణి. ఆమె మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు రావు రమేష్‌కు సంతాపం వ్యక్తం చేశారు. రావు రమేష్‌ను పరామర్శించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.

రావు రమేష్ నివాసానికి చిరంజీవి

రావు రమేష్ నివాసానికి చిరంజీవి

కమలకుమారి మరణవార్త విన్న వెంటనే మెగాస్టార్ చిరంజీవికి హుటాహుటిన రావు రమేష్ నివాసానికి వెళ్లారు. కమలకుమారి పార్ధీవదేహాం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి చిరంజీవి శ్రద్ధాంజలి ఘటించారు.

చిరంజీవి ఓదార్పు

చిరంజీవి ఓదార్పు

తల్లి మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న రావురమేష్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని ఆయన నింపారు. రావు గోపాలరావు దంపతులతో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.

రావు కుటుంబంతో గొప్ప అనుబంధం

రావు కుటుంబంతో గొప్ప అనుబంధం

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రావు గోపాలరావు, చిరంజీవి మధ్య గొప్ప అనుబంధం ఉంది. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా చిరంజీవికి రావుగోపాలరావు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి మామ అల్లు రామలింగయ్యకు, రావు గోపాలరావుకు ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు.

చిరంజీవి నటించిన చిత్రాల్లో

చిరంజీవి నటించిన చిత్రాల్లో

చిరంజీవి నటించిన చిత్రాల్లో దాదాపు రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్ని పోషించేవారు. రావు గోపాలరావుకు గొప్ప విలన్‌గానే కాకుండా విలక్షణ నటుడు అనే ఖ్యాతి ఉంది. చిరంజీవి నటించిన పలు చిత్రాల్లో రావు గోపాలరావు ప్రతినాయకుడి పాత్రను పోషించారు.

English summary
Wife of renowned actor late Sri Raogopal Rao garu and the mother of the actor Sri Raoramesh garu has passed away. She has been sick since few days and left her last breath today morning at Raoramesh's home at kondapur. Many personalities of Industry expressed their condolence to Rao Ramesh. In this sad moments, Chiranjeevi gives moral support to Rao Ramesh. Chiranjeevi personally went Rao Ramesh and given condolence to the entire family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X