»   » దాసరి మృతి: షాక్‌కు గురిచేసిందన్న చిరంజీవి, చెర్రీ దిగ్భ్రాంతి

దాసరి మృతి: షాక్‌కు గురిచేసిందన్న చిరంజీవి, చెర్రీ దిగ్భ్రాంతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దాసరి నారాయణ రావు ఆకస్మిక మృతితో తెలుగ సినీ పరిశ్రమ శోకసముద్రంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దాసరి తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకు పలువురిని పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.

ప్రముఖ హీరోలకు హిట్ చిత్రాలను అందించిన ఘనత కూడా ఆయనకు ఉంది. ఆయన మృతికి ప్రముఖ హీరో, రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో పాటు పలువురు సంతాపం ప్రకటించారు.

దాసరి గారి మరణం షాక్‌కి గురిచేసింది: చిరంజీవి

దాసరి గారి మరణం షాక్‌కి గురిచేసింది: చిరంజీవి

దర్శకరత్న దాసరిగారి అకాల మరణ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇటీవలే ఆయన ఆనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్య గారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతు మీదుగా అందజేశాను. ఆ సమయంలో ఆయనతో చాలా సేపు మాట్లాడటం జరిగింది. చాలా ఆరోగ్యంగా నాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను చైనాలో ఉన్నాను ఇంతలో ఇలాంటి చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం యావత్తు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. దర్శక నిర్మాతగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవ‌లు అనీర్వచనీయం. ఇప్పటివరకూ తెలుగు సినిమాకు పెద్ద దిక్కులా ఉన్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం భాదాకరం. బౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన సేవల‌ను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాం....చిరంజీవి

చిత్రపరిశ్రమకు తీరని లోటు : రామ్‌చరణ్‌

చిత్రపరిశ్రమకు తీరని లోటు : రామ్‌చరణ్‌

తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు గారి మరణం యావత్త్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కల‌గాల‌ని కోరుకుంటున్నాను

పెద్ద దిక్కును కోల్పోయాం: శివాజీ రాజా, న‌రేష్‌

పెద్ద దిక్కును కోల్పోయాం: శివాజీ రాజా, న‌రేష్‌

అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో ట్రీట్ మెంట్ తీసుకుని చాలా త్వ‌ర‌గా కోల్కుని మ‌ళ్లీ ఇంటికొచ్చారు. ఇటీవ‌లే ఫ్యాన్స్ స‌మ‌క్షంలో ఘనంగా పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఇంత‌లోనే దాస‌రి గారి గురించి పెను విషాదం లాంటి వార్త‌ను వినాల్సి వ‌చ్చింది. ఆయ‌న మ‌ర‌ణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. మా టీమ్ అంద‌రికీ పెద్ద దిక్కులా ఉండే వ్య‌క్తిని మేము కోల్పోయాం. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో సేవ‌లందించిన వ్య‌క్తి. ద‌ర్శ‌క దిగ్గ‌జం లేర‌న్న వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాం.. `మా` అధ్య‌క్షులు శివాజీ రాజా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్‌

అండను కోల్పోయింది....

అండను కోల్పోయింది....

తెలుగు సినీ పరిశ్రమ కొండంత అండని కోల్పోయిందని నటుడు నరేష్ అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా..కార్మికులకుగాని, సినీ నటులకుగాని, ప్రొడ్యూసర్లకి గాని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తలుపుకొడితే పలికే దైవం దాసరి అని చెప్పారు. తనకు చిన్నపటి నుంచి పరిచయమున్నట్లు తెలిపారు. తాతామనవడు సినిమాలో తన తల్లి విజయ నిర్మలాని అద్భుతంగా చూపించారని నరేష్ చెప్పారు.

English summary
Mega star Chiranjeevi condoled the death of Tollywood director Dasari Narayana Rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu