twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా బాగుందంటూ చిరంజీవి మెచ్చుకున్నాడు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయిశ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన 'అల్లుడు శ్రీను' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం వినాయక్ మార్క్ ఎంటర్టెనర్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ వీక్షించారు.

    సినిమా చూసి అనంతరం చిరంజీవి స్వయంగా వినాయక్‌కు ఫోన్ చేసి మంచి కమర్షియల్ ఎంటర్టెనర్ తీసావని మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సాయిశ్రీనివాస్‌ను కూడా విష్ చేసినట్ల సమాచారం. ఏకంగా చిరంజీవి నుండి ఫోన్ రావడంతో సాయి శ్రీనివాస్ చాలా సంతోషంగా ఉన్నాడట.

    Chiranjeevi congratulated VV Vinayak for alludu seenu movie

    చిరంజీవి 150వ సినిమాకు వివి వినాయకే దర్శకత్వం వహిస్తాడని గత కొంతకాలంగా వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనే దర్శకుడనే విషయం ఇంకా ఫైనల్ కాకపోయినప్పటికీ...చిరంజీవి ఫోన్ చేసి ప్రశంసించడం లాంటి పరిణామాలు అభిమానుల్లో ఆశలు రేపుతున్నాయి.

    'అల్లుడు శ్రీను' చిత్రం తొలిరోజు ఓపెనింగ్స్ కలెక్షన్స్ అదిరాయ్. దాదాపు స్టార్ హీరోల సినిమాలకు వచ్చేంత కలెక్షన్ రాబట్టినట్లు తెలుస్తోంది. బెల్లకొండ సురేష్ తనయుడు సాయిశ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం లక్ష్యం దాదాపుగా నెరవేరింది. ఒక విజయవంతమైన కమర్షియల్ సినిమాతో సాయి శ్రీనివాస్‌ను లాంచ్ చేయాలనుకున్న దర్శక నిర్మాతలు టార్గెట్ దాదాపుగా రీచ్ అయ్యారు. తొలి సినిమాలో సాయి శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపించుకున్నాడు. డాన్సులు, పైట్లు బాగానే చేసాడు. కాస్త సానబెడితో మాస్ హీరో అవుతాడనే అభిప్రాయం అందరిలోనూ కల్పించాడు. కాక పోతే సినిమా కథ, కథనం రొటీన్‌గా ఉండటంతో 'అల్లుడు శ్రీను' తొలిరోజు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఏది ఏమైతేనేం....ఈ ఫలితాలతో నిర్మాత బెల్లంకొండ సురేష్ సంతృప్తిగానే ఉన్నాడని టాక్.

    English summary
    Chiranjeevi, Ram Charan have watched the recently released ‘Alludu Seenu’ yesterday. After watching the film, Chiranjeevi personally called director VV Vinayak and congratulated him for making a good commercial movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X