Don't Miss!
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Chiranjeevi 'నేనొక నటుడిని' అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి.. మనసుకు తాకేలా కళాకారుల షాయరీ!
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటుడు మెగాస్టార్ చిరింజీవి. కొంతకాలం రాజకీయాలతో సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తనదైన మ్యానరిజంతో అలరిస్తున్నారు. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో దూసుకుపోతున్నారు. తాజాగా రంగస్థల కళాకారుల గురించి తన గళం విప్పారు.

కమ్ బ్యాక్ హిట్ కొట్టి..
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తూ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అలాగే పలు చిత్రాలకు వాయిస్ కూడా అందిస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టిన చిరంజీవి త్వరలో వాల్తేరు వీరయ్యగా రాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది.

తనదైన స్టైల్ లో వాయిస్ ఓవర్..
మాస్ మహారాజా రవితేజ సైతం నటిస్తున్న ఈ మూవీ టీజర్ మాస్ ఎలిమెంట్స్‌తో అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. చిరంజీవి ఇదే కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అప్పుడప్పుడు కొన్ని చిత్రాలకు తనదైన స్టైల్ లో వాయిస్ ఇస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా రంగస్థల కళాకారుల గురించి గళం విప్పారు.

త్వరలో విడుదల చేసేందుకు..
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం రంగమార్తాండ. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శివగామి రమ్యకృష్ణ, కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం, బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్, హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
|
అన్నయ్యకు కృతజ్ఞతాభివందనం..
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక షాయరీ ఉంది. అది రంగస్థల కళాకారుల గురించి వివరించేది. దానికోసం మెగాస్టార్ చిరంజీవి గళం అందించారు. నేనొక నటుడిని అంటూ సాగే ఈ షాయరిని చెప్పే సమయంలో మెగాస్టార్ కంటతడి కూడా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను డైరెక్టర్ కృష్ణవంశీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. "అన్నయ్యకు కృతజ్ఞతాభివందనం. ఇదే ఆ తెలుగు షాయరీ. ఒక అరుదైన ఆలోచనకు లక్ష్మీ భూపాల్ అందమైన అక్షర రూపం. సంగీత దైవం ఇళయరాజా గంధర్వ స్వరాలతో. నటమార్తాండ అపురూప గళమాధుర్యంలో.. మీకు నచ్చుతుందని ఆశిస్తూ. శుభాకాంక్షలు" అని ట్వీట్ లో రాసుకొచ్చారు డైరెక్టర్ కృష్ణవంశీ.

షాయరీకి తగినట్లుగా వచ్చే..
ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి పలికిన మాటలు, చూపించిన సన్నివేశాలు సగటు కళాకారుల జీవితానికి అద్దం పట్టేలా ఉన్నాయి. కృష్ణవంశీ ఆలోచనలను ప్రతిబింబించే విధంగా రచయిత లక్ష్మీ భూపాల్ ఈ షాయరీని రాసుకొచ్చారు. షాయరీని చిరంజీవి గొంతు నుంచి వినిపిస్తుంటే వీడియోలో షాయరీకి తగినట్లుగా వచ్చే చిరంజీవి ఫొటోలు మనసును తాకేలా ఉన్నాయి. కాగా రంగమార్తాండ సినిమా మరాఠి సూపర్ హిట్ మూవీ నట సామ్రాట్ కు రీమెక్ గా తెరకెక్కింది. సినిమా కథలో ఆత్మను చెడగొట్టకుండా తనదైన శైలీలో మార్పులు చేశారట డైరెక్టర్ కృష్ణవంశీ.