»   » చిరంజీవి గెస్ట్ రోల్ లో 'స్వయంకృషి'చిత్రం..త్వరలో షూటింగ్

చిరంజీవి గెస్ట్ రోల్ లో 'స్వయంకృషి'చిత్రం..త్వరలో షూటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరకాల విరామం తర్వత చిరంజీవి తన ముఖానికి రంగు వేసుకోవటానకి సిద్దపడుతున్నాడు. అయితే అది తెలుగు చిత్రం కోసం కాదు.కన్నడ చిత్రం లో ఆయన గెస్ట్ రోల్ వేయనున్నారు. ఆ చిత్రం టైటిల్ 'స్వయంకృషి'.ఈ విషయాన్ని స్వయంకృషి చిత్రనటుడు, నిర్మాత మరియు దర్శకుడు అయిన వీరేంద్రబాబు కన్ఫర్మ్ చేసారు. ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ 'నేను నటిస్తున్న 'స్వయంకృషి' అనే చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించటానికి ఒప్పుకున్నారు.త్వరలో షూటింగ్ లో కూడా పాల్గొంటారు. ఈ చిత్రంలో ఇంకా అంబరీష్, సుమన్, బియాంకా దేశాయ్ మున్నగువారు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇంతకుముందు కూడా చిరంజీవి..కన్నడ సూపర్ స్టార్ వి.రవిచంద్రన్ నటించిన 'సిపాయి' చిత్రంలో కనపడిన సంగతి తెలిసిందే.రామ్ చరణ్ మగధీర చిత్రంలో బంగారు కోడి పెట్ట పాటలో కనపడ్డ తర్వాత ఆయన ఏ చిత్రంలోనూ కనపడలేదు.ఆయన 150 వ చిత్రం అంటూ రకరకాల వార్తలు వచ్చినా ఏదీ కార్యరూపం దాల్చలేదు.

English summary
Megastar Chiranjeevi appears in guest role in Kannada film titled Swayamkrushi. If all goes well, then this will be Chiranjeevi's 150th movie including all guest roles so far and truly a treat to see Megastar on rocking on silver screen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu