»   » హీరోగా నా స్థానాన్ని భర్తీ చేశాడు : చిరంజీవి

హీరోగా నా స్థానాన్ని భర్తీ చేశాడు : చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ''ప్రస్తుతం సినిమా ఆలోచనేదీ లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో నా స్థానాన్ని రామ్‌చరణ్‌ భర్తీ చేయడం ఎంతో ఆనందంగా ఉంది'' అన్నారు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), ప్రముఖ నటుడు చిరంజీవి. మకావులో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఇఫా) అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. పర్యాటక శాఖ చేపడుతున్న ఇంక్రెడిబుల్‌ ఇండియాకి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తనయుడు రామ్‌చరణ్‌ గురించీ, చిత్ర పరిశ్రమల్లో మార్పు గురించీ మాట్లాడారు.

అలాగే ''నా కలల్ని, ఆశల్ని మా పిల్లలపై ఎప్పుడూ రుద్దలేదు. చరణ్‌ తనకు తానుగా ఎదిగిన మంచి నటుడు. తొలి సినిమాలో నటనను చూసి నేనే ఆశ్చర్యపోయాను. 'జంజీర్‌' సినిమాతో హిందీలోనూ విజయం అందుకొంటాడన్న నమ్మకం నాకుంది. అమితాబ్‌ బచ్చన్‌కి యాంగ్రీ యంగ్‌మేన్‌ గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం 'జంజీర్‌'. ఆ సినిమా రీమేక్‌లో రామ్‌చరణ్‌ నటించడం ఆనందంగా ఉంది'' అన్నారు.

ఇక ''నా దృష్టిలో ఇదొక మంచి మార్పు. అన్ని పరిశ్రమలకూ మేలు జరుగుతుంది. దేశవ్యాప్తంగా అభిమానుల్ని అలరించే అవకాశం ఉంటుంద''న్నారు. కేంద్ర పర్యటక శాఖ మంత్రి హోదాలో మన దేశంలో విదేశీ సినిమాల చిత్రీకరణను మరింతగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు చిరంజీవి.

''విదేశాల్లో చిత్రీకరణకు వెళ్లినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవ్వవు. కానీ వాళ్లు మన దేశానికి వచ్చినప్పుడు మాత్రం చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. ఒక నటుడిగా ఆ సమస్యల గురించి నాకు అవగాహన ఉంది. అందుకే చిత్రీకరణకు ఏకగవాక్ష పద్ధతిలో అనుమతుల్ని ఇచ్చేలా కృషి చేస్తున్నాము''అన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారవర్గాలు విదేశీ నిర్మాతల సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా కృషి చేయాలని కోరారు.

English summary

 Mega Star Chiranjeevi says that he is very much happy with his Son RamChran's Films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu