For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా 'మనసు': ఆ విషయం తెలిసి చలించిపోయిన చిరంజీవి దంపతులు..

  |

  సినిమా అనేది ఓ రంగుల కల.. ఓ సామాన్యుడి వాస్తవ జీవితానికి అది వేల మైళ్ల దూరం. అందుకునే ప్రయత్నంలో ఎన్నో అవాంతరాలు. తీరా అందుకున్నా.. అక్కడ నిలదొక్కుకోవడం అతిపెద్ద సవాల్. ఒక్కోసారి అవకాశాలు బాగానే ఉన్నా.. ఆర్థికంగా పెద్దగా ఎదుగూ బొదుగూ ఉండకపోవచ్చు.

  దాసరి మనుషుల్లో మాణిక్యం..!

  ఇండస్ట్రీలో ఆర్థికంగా ఎదగలేక.. లేక ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ తెలియక చితికిపోయిన నటులు ఎంతోమంది తారసపడుతారు. మరికొందరి జీవితాలు మాత్రం అనుకోని విషాదాల కారణంగా చితికిపోతుంటాయి.

  ఇందులో తిరిగి గాడినపడేవారు కొందరైతే.. నిస్సహాయంగా తమను ఆదుకునేవారి కోసం ఎదురుచూసేవారు మరికొందరు. అలా సహాయం కోసం ఎదురుచూసేవాళ్లకు ఆపన్న హస్తం అందించడం నిజంగా అభినందనీయమే.

   మెగా 'సహాయం':

  మెగా 'సహాయం':

  తెలుగు సినీ పరిశ్రమలో తమదైన హాస్యంతో మెప్పించినవారు పొట్టి వీరయ్య, గుండు హనుమంతరావు. ఎక్కడా అసభ్యతకు తావులేని కామెడీతో గుండు హనుమంతరావు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కానీ ఆయన్ను మాత్రం విషాదమే ఎక్కిరించింది.

  కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన వంతు సహాయంగా పొట్టి వీరయ్య, గుండు హనుమంతరావులకు చెరో రూ.2లక్షలు ఆర్థిక సహాయం అందించారు.

   శివాజీరాజాను పిలిచిన చిరంజీవి:

  శివాజీరాజాను పిలిచిన చిరంజీవి:

  పొట్టి వీరయ్య, గుండు హనుమంతరావులకు చెక్ అందజేసిన సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీ రాజా మీడియాతో మాట్లాడారు. 'మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేసి అర్జెంట్‌గా ఇంటికిరా అన్నారు. వెంట‌నే శ్రీరామ్, నేను వెళ్లాము. గుండు హ‌నుమంతురావు, పొట్టి వీర‌య్య క‌ష్టాల్లో ఉన్నట్లున్నారు. వెంట‌నే వాళ్లిద్ద‌రికీ చెరో రెండు ల‌క్ష‌లు ఇవ్వ‌మ‌ని చెక్కులు ఇచ్చారు.' అని చెప్పారు.

  హ్యాట్సాఫ్ టు చిరంజీవి:

  హ్యాట్సాఫ్ టు చిరంజీవి:

  'గుండు హనుమంతరావు ఆసుపత్రిలో ఉండగా అక్కడికే వెళ్లి చెక్ అందజేశాం. ఆయన బెడ్‌ మీద నుంచే చిరంజీవిగారితో ఫోన్‌లో మాట్లాడారు. చిరంజీవి గారు చాలా సంతోషించారు. ‘ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. ఎవ‌రు క‌ష్టాల్లో ఉన్నా నా కొచ్చి చెప్పు. స‌హాయం చేద్దాం' అని భరోసా ఇచ్చినట్లు శివాజీ రాజా తెలిపారు. ఒక నటుడిగా చిరంజీవి చేసిన సహాయానికి సంతోషిస్తున్నానని అన్నారు. చిరంజీవికి హ్యాట్సాఫ్ చెప్పారు.

  గుండు హనుమంతరావు 'ధీన స్థితి':

  గుండు హనుమంతరావు 'ధీన స్థితి':

  నిజానికి గుండు హనుమంతరావు ఆర్థిక పరిస్థితి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇటీవల అలీ నిర్వహించే ఓ టీవి చానెల్ రియాలిటీ 'షో'లో పాల్గొన్న తర్వాతే ఆయన ధీన స్థితి అందరికీ తెలిసింది. పాతికేళ్ల కెరీర్ లో కోట్లు పోగొట్టుకున్నట్లు ఆ 'షో' లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య చనిపోవడంతో మరింత కుంగిపోయినట్లు, ఉన్న డబ్బంతా విదేశాల్లో కొడుకు చదువుకే వెచ్చించినట్లు చెప్పారు.

  వైద్యానికి డబ్బుల్లేక:

  వైద్యానికి డబ్బుల్లేక:

  ఓవైపు భార్య చనిపోయిన విషాదం వెంటాడుతుంటే.. అదే సమయంలో తన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయన్న సంగతి తెలిశాయన్నారు. వైద్యానికి చేతిలో డబ్బు లేకపోయినా.. ఎప్పుడూ ఎవరితో తన పరిస్థితి గురించి చెప్పుకోలేకపోయానని అన్నారు. తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొడుకు సైతం విదేశాల్లో ఉద్యోగం మానుకుని తన వద్దకే వచ్చినట్లు చెప్పుకొచ్చాడు.

   చలించిపోయారు..:

  చలించిపోయారు..:

  యమలీల లాంటి సినిమాలో ఒకప్పుడు తన తోటి నటుడిగా నటించిన గుండు హనుమంతరావు.. ఇంతటి ధీన స్థితిలో ఉన్నాడని తెలుసుకుని అలీ చలించిపోయారు.

  గుండు హనుమంతరావు వైద్య ఖర్చులు తాను భరిస్తానని 'షో' లోనే ప్రామిస్ చేశారు. ఆ షో తర్వాతే గుండు హనుమంతరావు ఆర్థిక పరిస్థితి గురించి ఇండస్ట్రీలో చాలామందికి తెలిసింది.

  ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవికి, ఆయన సతీమణి సురేఖకు కూడా గుండు హనుమంతరావు ధీన స్థితి గురించి తెలిసి చలించిపోయారు. వాళ్లను ఆదుకోవాలని నిర్ణయించుకుని శివాజీ రాజా ద్వారా చెక్కులు అందజేశారు.

  English summary
  Megastar Chiranjeevi has offered financial assistance of four lakhs to senior comedians Gundu Hanumantha Rao and Potti Veeriah.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X