»   » చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందడి షురూ (ఫోటోస్)

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందడి షురూ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. చిత్తురు చెంది ఎన్నారై బిజినెస్ మేన్ (యూఎస్ఏ) ఆమె వివాహం జరుగబోతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఓ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ లా వ్యాపించింది. ఈ ఫోటో చూస్తుంటే చిరంజీవి ఇంట్లో పెళ్లి వేడక మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఇటీవల చిరంజీవికి భుజానికి ఆపరేషన్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలో ఆయన చేతికి కట్టుతో ఉన్నారు. చిరంజీవి ఫ్యామిలీ ఈ పెళ్లికి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకోవడానికి ఇష్టపడటం లేదు.

పవన్ కళ్యాణ్ వచ్చింది అందుకే...
కాపు ఐక్య గర్జన అనంతరం జనసేన అధ్యక్ష్యుడుగా పవన్ కళ్యాణ్...కేరళ నుంచి హైదరాబాద్ కు సర్దార్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న ఆయన వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కాపు గర్జన పై తన అభిప్రాయాలు చెప్పారు. ఆ మరుసటి రోజు జెఎహెచ్ఎంసీ పోలింగ్ లో ఓటు కూడా వేయకుండా ఆయన కేరళ వెళ్లిపోయారు. అయితే ఫిబ్రవరి 1 రాత్రి ఆయన ఇక్కడ హైదరాబాద్ లో చిరంజీవి ఇంట్లో గడిపినట్లు సమాచారం. హఠాత్తుగా చిరంజీవి ఇంటికి ఎందుకు వెళ్లారు అనేది ఆసక్తికరమైన అంశం.

ఆ సమయంలో చిత్తూరు నుంచి చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కాబోయే భర్తని, అతని కుటుంబాన్ని చిత్తూరు నుంచి రప్పించారని సమాచారం. వచ్చాక పవన్ కళ్యాణ్ సమక్షంలో వివాహ తేదీ, మిగతా ఫార్మాలిటీస్ ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. బాబాయ్ గా ఇదంతా పవన్ ఉండగా జరిగితే బావుంటుందని చిరంజీవి భావించటంతో పవన్ ఇలా షెడ్యూల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా తన ఇంటికి రమ్మనమని ఇన్వైట్ చేయటానికే చిరంజీవి ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కు వెళ్లి మరీ పిలిచినట్లు సమచారం. వేరే రోజు ఈ పోగ్రామ్ పెట్టుకుందామనుకున్నా..బిజీ షెడ్యూల్ తో దొరకని ఎలాగూ పవన్ ..సిటీకి వచ్చారు కదా అని చిత్తురు నుంచి వారిని రప్పించి పని పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని మీడియాకు ముందుగా లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి వేడక లానే ఉంది?

పెళ్లి వేడక లానే ఉంది?


ఈ ఫోటో చూస్తుంటే చిరంజీవి ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోందని స్పష్టమవుతోంది.

శ్రీజ పెళ్లేనా?

శ్రీజ పెళ్లేనా?


మరి చిరంజీవి ఫ్యామిలీ నుండి అఫీషియల్ ప్రకటన వస్తే తప్ప ఏ విషయం అనేది మనం అఫీషియల్ గా నమ్మకడానికి వీల్లేదు!

మొదటి వివాహం

మొదటి వివాహం


శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహరం గురించి అందరికీ తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న శ్రీజ....కొంత కాలం అతనితో కాపురం చేసి ఓ బిడ్డకు తల్లయింది. ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ అసలు రూపం తెలుసుకుని అతనికి దూరమైంది.

అదో పీడకల

అదో పీడకల


శ్రీజ మొదటి పెళ్లి వ్యవహారం మెగా ఫ్యామిలీకి ఓ పీడకలలా ముగిసిందని కొందరు అంటుంటారు

English summary
There is no official confirmation or any update about it, but there is a rumor making rounds about Chiranjeevi's younger daughter Srija getting married again to a US based Indian origin businessman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu