»   » ఉయ్యాలవాడ గా చిరు లుక్ బయటపడ్డట్టే: ఈ ఫొటోలు చూడండి

ఉయ్యాలవాడ గా చిరు లుక్ బయటపడ్డట్టే: ఈ ఫొటోలు చూడండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖైదీనెం 150 తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డేనా కాదా అన్న డైలమాలో చాలామందే ఉన్నారు. ఒకసారి కన్ ఫార్మ్ అనీ మరో సారి తూచ్..తూచ్..! వేరే మాస్ సినిమా అనీ ఏవేవో వార్తలు వినిపిస్తూ మరింత అయోమయానికి గురి చేసాయి. మొన్నటికి మొన్న హీరో శ్రీకాంత్ చెప్పాక కొంత నమ్మకం కుదిరింది జనాలకి..

ఫిక్స్ అయిపోవచ్చు

ఫిక్స్ అయిపోవచ్చు

అయినా ఇంకా ఎక్కడో అనుమానమే ఎందుకంటే ఇటు మెగా కాంపౌండ్ నుంచి గానీ, అటు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోయే సురేంద్ర రెడ్డి గానీ అధికారికంగా చెప్పకపోవటమే. అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం తో మనం ఇక ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరు ఎంట్రీ పక్కా అని గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు.....

ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్

ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్

ఖైదీ నంబర్ 150తో ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు తన 151వ సినిమాకి రెడీ అయిపోతున్నారు. ధృవ టైమ్ లోనే తన తర్వాతి సినిమా చిరంజీవితో చేయబోతున్నట్లు సురేందర్ రెడ్డి చెప్పాడు కానీ.. అప్పట్లో ఇది పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారంతా.

లుక్ చూడగానే సీన్ అర్థమైపోయింది

లుక్ చూడగానే సీన్ అర్థమైపోయింది

ఒక పక్క సినిమాకి సంబందించిన పనులు చేస్తూనే ఇంకా అధికారిక ప్రకటన మాత్రం చేయక పోవటం తో ఇంకా అనుమానం గా ఉన్న వాళ్ళకి నిన్నటి చిరులుక్ చూడగానే సీన్ అర్థమైపోయింది. ఉయ్యాలవాడ ధీరుడు గా కనిపించ బోతున్నాడన్న విషయం ఇక దాచే పని లేదని తెలిసి పోయింది.

దాస‌రి నారాయ‌ణ‌రావు

దాస‌రి నారాయ‌ణ‌రావు

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు మే 30న మరణించిన నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ తరుపున శ‌నివారం రామానాయుడు స్టూడియోలో సంతాప స‌భ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. చైనా టూర్ ముగించుకుని తిరిగి వచ్చిన చిరంజీవి కూడా సంతాప సభలో పాల్గొన్నాడు.

దాసరి కడసారి చూపు దక్కక పోవడం

దాసరి కడసారి చూపు దక్కక పోవడం

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. తనకు దాసరి కడసారి చూపు దక్కక పోవడం ఎంతో అసంతృప్తిని కలిగించిందని చెప్పుకొచ్చాడు. అంత విషాద సందర్భం లో చాలామంది గమనించిన విశేషం చిరంజీవి లుక్. ఒత్తుగా పెరిగిన మీసాలతో సాహస కథల్లో ఉండే హీరో గెటప్ కి దగ్గరగా కనిపించాడు మెగా స్టార్.

చైనా పర్యటన లో ఉన్నప్పుడు

చైనా పర్యటన లో ఉన్నప్పుడు

నాలుగు రోజుల కింద చైనా పర్యటన లో ఉన్నప్పుడు పెట్టిన పోస్ట్ లో మరీ అంత స్పష్టంగా కనిపించలేదు కానీ నిన్న మాత్రం చిరు మీసం కాస్తా భారీ ఆకారం లో కనిపించటం, మెగాస్టార్ మొహం లో గంభీరత కనిపించటం చూసాక ఉయ్యాల వాడ ని తెరమీద చూసే సందర్భం త్వరలోనే ఉందనుకుంటూ చెప్పుకున్నారు సినీజనాలు.

సోషల్‌ మీడియాలో

సోషల్‌ మీడియాలో

ఇక ఇంకా ఉత్సాహ వంతులైన ఫ్యాన్స్ అయితే చిరంజీవి తాజా గెటప్‌ చూసి, ఇదే ఉయ్యాలవాడలో చిరంజీవి కన్పించబోయే గెటప్‌ అని పక్కాగా చెబుతూ సోషల్‌ మీడియాలో ఈ ఫొటోల్ని షేర్‌ చేసేస్తున్నారు. అయితే పక్కాగా ఒక ప్రకటన వెలువడే వరకూ ఇదెంతవరకు నిజం అన్నది సస్పెన్సే...

English summary
People Noteced chiru's new look with Big Moustaches at dasari narayana rao"s condolece meeting
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu