Just In
Don't Miss!
- News
జగన్ 36 కేసుల కోసం 32 మంది ప్రాణ త్యాగం చేసిన విశాఖ ఉక్కును పణంగా పెట్టారు : అచ్చెన్న ఫైర్
- Sports
బెన్ స్టోక్స్ నన్ను తిట్టాడు.. అందుకే కోహ్లీ భాయ్ జోక్యం చేసుకున్నాడు: మహ్మద్ సిరాజ్
- Lifestyle
ఊబకాయానికి ప్రమాద కారకాలు మీకు తెలుసా? తెలివిగా దీన్ని ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసా?
- Automobiles
మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?
- Finance
మళ్లీ ఎగిసిపడిన బిట్‌కాయిన్, భారత్‌లో క్రిప్టోకు భలే డిమాండ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. చిరు వేసే ట్వీట్లలో ఎంత వెటకారం, ఫన్ ఉంటుందో అందరూ రుచి చూసి ఉంటారు. గతేడాది చిరంజీవి ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఓ ఆట ఆడేసుకున్నాడు. అలా చిరంజీవి వేసే ట్వీట్లకు, పంచ్‌లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎలాంటి వారికైనా సరే చిరు కౌంటర్ ఇస్తుంటాడు. అలాంటి చిరు తాజాగా ఓ పోస్ట్ చేశాడు.

వరుసగా సినిమాలు..
చిరంజీవి సైరా సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. అలా అక్కడ పెరిగిన గ్యాప్‌ను పూడ్చేందుకు వరుసగా ప్రాజెక్ట్‌లను సెలెక్ట్ చేసుకున్నాడు. కొరటాల శివతో ఆచార్య సినిమా అని ప్రకటించి రెండేళ్లు అవుతున్నా కూడా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇలా పెరుగుతున్న గ్యాప్‌ను సెట్ చేసుకునేందుకు వరుసగా చిత్రాలను లైన్‌లో పెట్టాడు.

మూడు ప్రాజెక్ట్‌లు..
ఆచార్య సినిమా తరువాత చిరంజీవి వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అన్నింటి కంటే ముందుగా లూసిఫర్ సినిమాను ఓకే చేశాడు. అయితే లూసిఫర్ రీమేక్ విషయంలో డైరెక్టర్‌ను సెలెక్ట్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. మొదటగా సుజిత్‌ని అనుకున్నారు మధ్యలో వినాయక్ చేతికి వెళ్లింది. మధ్యలో హరీష్ శంకర్ పేరు కూడా వచ్చింది.

చివరకు అలా..
చివరకు జయం మోహన్ రాజాను లూసిఫర్ రీమేక్‌కు దర్శకుడిగా ఫిక్స్ చేశారు. అలా ఎవ్వరూఊహించనిపేరు బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే లూసిఫర్ తరువాత చిరు వేదాళం రీమేక్‌లో నటించనున్నాడు. ఆ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించనున్నాడు.

లూసిఫర్ ప్రారంభం..
చిరంజీవి లూసిఫర్ చిత్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి పాల్గొన్నాడు. ఫిబ్రవరి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతోన్నట్టు ప్రకటించారు. అయితే ఈ మూవీ ప్రారంభోత్సవంలో ఓ అరుదైన ఘట్టం జరిగింది. ఇదే విషయం గురించి చిరంజీవి తాజాగా ట్వీట్ చేశాడు.

నలుగురు దర్శకులు..
లూసిఫర్ రీమేక్ ప్రారంభోత్సవంలో చిరంజీవి నాలుగు చిత్రాల దర్శకులు కలిశారు. కొరటాల శివ, మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబీలు కలిశారు. వారితో కలిసి దిగిన ఫోటోను చిరంజీవి పోస్ట్ చేశాడు. ఈ నలుగురు దర్శకులు ఫంటాస్టిక్.. చార్ కదమ్ అంటూ తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.